వివో (VIVO) వి35 స్లిమ్ అల్ట్రా 5జి ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది.అత్యంత సన్నని డిజైన్ తో, చేతిలో పట్టుకుంటే గాలిలో తేలినంత తేలికగా అనిపించే ఈ ఫోన్, లగ్జరీ, టెక్నాలజీల అద్భుత కలయిక. ఏకంగా కెమెరా, స్పీడ్ ఛార్జింగ్ వంటి కళ్లు చెదిరే ఫీచర్లను ఇందులో వున్నట్లు తెలుస్తుంది. స్మార్ట్‌ఫోన్ ప్రియులకు సరికొత్త అనుభూతిని అందించడమే లక్ష్యంగా వివో ఈ ఫ్లాగ్ షిప్ ఫోన్ ను రూపొందించినట్లు టాక్.
Read Also: Gig Workers Strike: ఈ నెల 31న డెలివరీ బాయ్స్ సమ్మె
రూ.49,999 నుంచి ప్రారంభం
6.78 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే దీని ప్రత్యేకతలు. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. 300ఎంపి ప్రైమరీ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 4800mAh బ్యాటరీతో 170W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది, ఇది కేవలం 20 నిమిషాల్లో 100% ఛార్జ్ అవుతుందని అంచనా. భారత మార్కెట్లో దీని ధర సుమారు రూ.49,999 నుంచి ప్రారంభం కావచ్చు.
(VIVO) ఈ కొత్త ఫోన్లో ప్రధానంగా హైలైట్ చేసింది స్లిమ్ డిజైన్. ఫోన్ చేతిలో పట్టుకుంటే ప్రీమియం ఫీల్ వచ్చేలా తక్కువ మందంతో రూపొందించారు. లైట్ వెయిట్ బాడీ కారణంగా ఎక్కువసేపు ఉపయోగించినా అసౌకర్యం అనిపించదు. సోనీ ఎక్స్పీరియా స్టైల్ ను గుర్తు చేసేలా, సింపుల్ అయినా క్లాసీ లుక్ ఇవ్వడానికి వివో ప్రయత్నించినట్టు అనిపిస్తుంది. స్లిమ్ బాడీతో పాటు బ్యాలెన్స్డ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఈ ఫోన్ ప్రత్యేకత.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: