Vahan Portal: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘వాహన్’ డిజిటల్ పోర్టల్‌లో చేరేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 15 నుంచి ఈ పోర్టల్ ద్వారా వాహనాలకు సంబంధించిన అనేక సేవలను ఆన్‌లైన్‌లోనే పొందే అవకాశం కల్పించనున్నారు.
Read also:TG: ఉద్యోగి చనిపోతే రెగ్యులర్ బెనిఫిట్లతో పాటు రూ.10 లక్షలు
RTA కార్యాలయాలకు వెళ్లకుండానే సేవలు
ఇకపై వాహనాలను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు లేదా విక్రయించినప్పుడు యజమాని పేరు, చిరునామా మార్పులు వంటి పనుల కోసం RTA కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ ప్రక్రియలన్నీ వాహన్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లోనే పూర్తి చేయవచ్చు. ఈ పోర్టల్‌లో సెకండ్ హ్యాండ్ వాహనాల పూర్తి హిస్టరీ, డూప్లికేట్ RC పొందడం వంటి సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. దీంతో వాహన యజమానులకు సేవలు వేగంగా, సులభంగా అందనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: