ప్రముఖ టెక్ కంపెనీ టీసీఎస్ లో బారీగా లేఫ్ లను ప్రకటిస్తున్నది. పెద్ద కంపెనీలతో పాటు చిన్న టెక్ కంపెనీలు(Tech companies) కూడా ఉద్యోగస్తులను తొలగిస్తున్నది. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ )తో ఉపాధికి పెద్ద ఎత్తున గండి కొడుతున్నది. ఇటీవల టీసీఎస్ కంపెనీ 2శాతం ఉద్యోగులను తొలగించింది. పైకి మాత్రం అధికారికంగా 12వేల ఉద్యోగులను తొలగించినట్లు టీసీఎస్ చెబుతున్నప్పటికీ దాదాపుగా 80వేల మందిని తొలగించినట్లు తెలుస్తోంది. కంపెనీ మాత్రం బయటకు 12వేల మందిని తొలగించినట్లు చెబుతుందని మాజీ ఉద్యోగులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
Read Also: New TG DGP: తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకారం
బలవంతంగా రీజైన్ చేయిస్తున్న వైనం
మరికొందరిని బలవంతంగా రాజీనామా(Resignation) చేయిస్తున్నారని ఉద్యోగులు సోషల్ మీడియా ద్వారా ట్వీట్లు చేస్తున్నారు. ఇటీవల ఓ సీనియర్ ఉద్యోగిని రిటైర్మెంట్ తీసుకోవమని టీసీఎస్ హెచ్ ఆర్లు బలవంతం చేసినట్లు తెలుస్తోంది. ఇంకా లేఫ్ లు ఉండే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. టీసీఎస్ లోపాటు యాక్సెంచర్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ నుంచి కంపెనీ తన ఉద్యోగస్తులను తొలగిస్తోంది. ఏఐయే అధిక పనులు చేస్తుండడంతో బడ్జెట్ తగ్గించుకునే పనిలో కంపెనీలు పడ్డాయి.
ఉద్యోగులను ఎలా తొలగిస్తున్నారు?
బలవంతపు రాజీనామాలు రాయమని కంపెనీ ఒత్తిడి తెస్తోందని వార్తలు చెబుతున్నాయి.
ఈ చర్యలకు కారణం ఏమిటి?
ఖర్చు తగ్గింపు, ప్రాజెక్టుల డిమాండ్ తగ్గడం, ఆటోమేషన్, పనితీరు మూల్యాంకనం ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: