📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌ సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌

Telugu News: Whatsapp-వాట్సాప్ వెబ్ యూజర్లకు ఇబ్బందులు – ప్రపంచవ్యాప్తంగా సమస్యలు

Author Icon By Pooja
Updated: September 9, 2025 • 5:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Whatsapp-ఇటీవల వాట్సాప్ వెబ్ వినియోగదారులు సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. లాగిన్ సమస్యలతో(login problems) పాటు, పేజీ స్క్రోలింగ్ సరిగా పనిచేయకపోవడం వలన వర్క్ చేసే వారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలు కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయని యూజర్లు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. పేజీని రిఫ్రెష్ చేస్తే కొంత సమయం పని చేసినా, తర్వాత మళ్లీ అదే సమస్య వస్తోందని పలువురు చెబుతున్నారు.

యూజర్ల ఫిర్యాదులు పెరుగుతున్నాయి

సెప్టెంబర్ 8న మధ్యాహ్నం 1:10 గంటల ప్రాంతంలో మొదలైన ఈ సమస్య 1:55 గంటల వరకు కొనసాగింది. దాదాపు 290 మంది యూజర్లు ఫిర్యాదులు(User complaints)నమోదు చేశారు. వీటిలో 54 శాతం సర్వర్ కనెక్షన్ సమస్యలు, 24 శాతం వెబ్‌సైట్ యాక్సెస్ ఇబ్బందులు, 22 శాతం యాప్ వినియోగ సమయంలో వచ్చిన సమస్యలు.

ఇదిలా ఉండగా, వాట్సాప్ తాజాగా iOS మరియు iPadOS పరికరాల్లో ఉన్న ఒక భద్రతా లోపాన్ని సరిచేసింది. ఈ బగ్ కారణంగా హ్యాకర్లు ఆపిల్ పరికరాల నుంచి వ్యక్తిగత డేటాను దోచుకునే అవకాశముందని ఒక బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడైంది. మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక అప్‌డేట్ విడుదల చేసింది. మరికొందరు యూజర్లు వాట్సాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఇబ్బందులు తక్కువయ్యాయని చెబుతున్నారు. అయితే వాట్సాప్ మరియు మెటా ఈ సమస్యలపై అధికారికంగా ఇంకా స్పందించలేదు.

వాట్సాప్‌లో సమస్యలు ఎప్పుడు మొదలయ్యాయి?
సెప్టెంబర్ 8న మధ్యాహ్నం 1:10 ప్రాంతంలో మొదలయ్యాయి.

ఎక్కువగా ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి?
సర్వర్ కనెక్షన్ సమస్యలు 54% ఫిర్యాదులుగా నమోదయ్యాయి.

Read hindi news:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-conflict-tensions-in-nepal-india-on-high-alert-at-the-border/national/544043/

Google News in Telugu Latest News in Telugu Telugu News Today WhatsApp down WhatsApp login problem WhatsApp Meta update WhatsApp scrolling bug WhatsApp web issues

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.