మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో వినియోగదారుల గోప్యతకు భంగం కలుగుతోందన్న ఆరోపణలపై బిలియనీర్ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ స్పందించారు. మెటా సంస్థ వాట్సాప్ చాట్ల ప్రైవసీ, భద్రత విషయంలో వినియోగదారులకు తప్పుదారి పట్టించే(Tech Updates) హామీలు ఇచ్చిందని ఆరోపిస్తూ అమెరికా కోర్టులో పిటిషన్ దాఖలవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Read Also: AI: ఏఐ టెక్నాలజీలో అమెరికాను చైనా మించి పోతుందా?
వాట్సాప్ భద్రతపై అనుమానాలు
ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదిక Xలో స్పందించిన ఎలాన్ మస్క్, వాట్సాప్ పూర్తిగా సురక్షితమైన యాప్ కాదని వ్యాఖ్యానించారు. వినియోగదారుల వ్యక్తిగత డేటా రక్షణపై సందేహాలు ఉన్నాయని సూచించారు. అంతేకాదు, గోప్యతకు మారుపేరుగా భావించే సిగ్నల్ యాప్ భద్రత కూడా ప్రశ్నార్థకమేనని ఆయన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
వాట్సాప్, సిగ్నల్‌లకు ప్రత్యామ్నాయంగా X చాట్‌ను(Tech Updates) వినియోగించాలని మస్క్ పిలుపునిచ్చారు. వినియోగదారుల ప్రైవసీకి ప్రాధాన్యం ఇచ్చే విధంగా X చాట్‌ను అభివృద్ధి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.
గతంలోనూ వివాదం
ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఎలాన్ మస్క్ వాట్సాప్ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తగా, మెటా సంస్థ వాటిని ఖండించింది. వాట్సాప్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అమల్లో ఉందని, చాట్లు పూర్తిగా సురక్షితమని మెటా స్పష్టం చేసింది. అయితే తాజా ఆరోపణల నేపథ్యంలో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: