📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త

Latest News: Smart Toilets: AI స్మార్ట్‌ టాయిలెట్లు ఎలా పనిచేస్తాయి?

Author Icon By Radha
Updated: October 17, 2025 • 10:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉదయం మీరు టాయిలెట్‌కు వెళ్లినప్పుడు అది మీ ఆరోగ్యాన్ని కూడా పర్యవేక్షిస్తుందని ఊహించారా? అదే ఇప్పుడు నిజమవుతోంది. AI ఆధారిత స్మార్ట్‌ టాయిలెట్లు(Smart Toilets) మీ మల, మూత్ర నమూనాలను విశ్లేషించి మీ శరీర స్థితిని అంచనా వేస్తాయి. వీటిలో అమర్చిన అధునాతన సెన్సార్లు, కెమెరాలు, AI అల్గారిథమ్‌లు ద్వారా మలం రంగు, ఆకారం, గట్టిదనం, పరిమాణం వంటి వివరాలను పరిశీలిస్తాయి. AI ఈ డేటాను “బ్రిస్టల్ స్టూల్ ఫామ్ స్కేల్” ఆధారంగా వర్గీకరించి ఏవైనా అసాధారణ మార్పులు లేదా రక్తం వంటి సూచనలను గుర్తిస్తే, యూజర్‌కి వెంటనే హెచ్చరిక పంపిస్తుంది. అదేవిధంగా, యూరిన్‌లోని హైడ్రేషన్ స్థాయిలను కొలిచి వ్యక్తిగత ఆరోగ్య సలహాలను కూడా అందిస్తుంది.

Read also: Renu Desai: రేబిస్ వ్యాక్సిన్ తీసుకున్న రేణు దేశాయ్

టోటో సంస్థ ఆధునిక ఆవిష్కరణ

జపాన్‌కు చెందిన టోటో టాయిలెట్స్ కంపెనీ(Toto Ltd.) ఈ టెక్నాలజీ అభివృద్ధిలో ముందుంది. వారి స్మార్ట్‌ కమోడ్‌లో(Smart Toilets) అమర్చిన సెన్సార్లు మలం రంగు, పరిమాణం, ఆకారం వంటి వివరాలను క్షణాల్లో స్కాన్‌ చేసి స్మార్ట్‌ఫోన్ యాప్‌కు పంపిస్తాయి. ఈ యాప్‌లో “స్టూల్ క్యాలెండర్‌” అనే ఫీచర్‌ ద్వారా రోజువారీ ఆరోగ్య డేటా భద్రపరుస్తుంది. దీని ఆధారంగా శరీరంలో ఏవైనా మార్పులు ఉన్నాయా, లేదా జీవనశైలిని ఎలా మార్చుకోవాలో సూచనలు ఇస్తుంది.

వృద్ధులు, రోగులకు మేలు చేసే టెక్నాలజీ

ఈ స్మార్ట్‌ టాయిలెట్లు(Smart Toilets) కేవలం ఆరోగ్య స్పృహ ఉన్న వ్యక్తులకే కాదు, తమ పరిస్థితి వివరించలేని వృద్ధులు, ఆసుపత్రి రోగులకు కూడా ఎంతో ఉపయోగకరం. ఇది సాధారణ మరుగుదొడ్డిని ఒక రోజువారీ ఆరోగ్య తనిఖీ కేంద్రంగా మార్చేస్తుంది. భవిష్యత్తులో, ఈ టాయిలెట్లు కొలొరెక్టల్ క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించే స్క్రీనింగ్ సాధనంగా మారే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

AI Smart Toilets Artificial intelligence Health Technology Toto Japan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.