📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త

Smart Phone : సమ్మర్లో మీ ఫోన్ వేడెక్కుతోందా?

Author Icon By Sudheer
Updated: April 8, 2025 • 5:26 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సమ్మర్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో ఎలక్ట్రానిక్ పరికరాలు, ముఖ్యంగా మనం రోజూ ఉపయోగించే మొబైల్ ఫోన్లు వేడెక్కే సమస్యకు గురవుతుంటాయి. నేరుగా సూర్యకాంతి ఫోన్పై పడితే, పరికరం వేడిని మరింతగా శోషించడంతో వేడెక్కడం వేగవంతమవుతుంది. ఇది ఫోన్ పనితీరుపై ప్రభావం చూపించడంతో పాటు, హార్డ్‌వేర్ డ్యామేజ్‌కు దారి తీసే ప్రమాదం ఉంది.

ఫోన్ వాడకాన్ని తగ్గించాలి

వేసవిలో ముఖ్యంగా గేమింగ్, వీడియో స్ట్రీమింగ్, హీటింగ్ యాప్స్ వంటి వాటిని ఎక్కువసేపు వాడకపోవడం మంచిది. ఫోన్ వేడిగా అనిపిస్తే, కొన్ని క్షణాలపాటు స్విచ్ ఆఫ్ చేసి కూల్ అయ్యేలా చూడాలి. ఫోన్‌ని ఛార్జింగ్ చేస్తూ ఉపయోగించడం, అధిక బ్రైట్‌నెస్‌తో వాడటం వంటి అలవాట్లు వేడెక్కింపునకు దారితీస్తాయి. ఇవి తప్పించుకుంటే ఫోన్ జీవితకాలం పెరుగుతుంది.

Smart phone

వేడెక్కిన ఫోన్‌ను ఫ్రీజ్ చేయకండి!

చాలామంది ఫోన్ వేడెక్కినప్పుడు వెంటనే ఫ్రీజర్లో పెట్టడం ద్వారా చల్లబరిచే ప్రయత్నం చేస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన చర్య. ఈ విధంగా ఉంచితే మినీ షార్ట్ సర్క్యూట్, డిస్‌ప్లే డ్యామేజ్, లేదా ఫోన్ పూర్తిగా పనిచేయకపోవడం వంటి సమస్యలు రావచ్చు. సాధ్యమైనంత వరకు ఫోన్‌కి సహజంగా తేమ లేకుండా చల్లదనాన్ని ఇవ్వడమే ఉత్తమం.

కారులో వదిలేయకండి

అత్యంత ఉష్ణోగ్రతలు నమోదయ్యే కారులో ఫోన్‌ను వదిలివేయడం కూడా చాలా ప్రమాదకరం. మూసివేసిన కారు లోపల ఉష్ణోగ్రత వేగంగా పెరుగుతుందని, అలాంటి వాతావరణంలో ఫోన్ ఉంచితే బ్యాటరీ పేలే ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో ఫోన్‌కి రక్షణగా ఉండేందుకు సంచుల్లో, నీడలో ఉంచడం అలవాటు చేసుకోవాలి.

Google News in Telugu smart phone Smart phone heat

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.