📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌ సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌

Telugu News: Meta-వచ్చే నెలలో భారత్‌లో విడుదల కానున్నస్మార్ట్ కళ్లద్దాలు

Author Icon By Sushmitha
Updated: September 18, 2025 • 1:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టెక్నాలజీ(Technology) దిగ్గజం మెటా, క్రీడాకారులు మరియు అవుట్‌డోర్ యాక్టివిటీస్ ఇష్టపడే వారిని లక్ష్యంగా చేసుకుని సరికొత్త స్మార్ట్ గ్లాసెస్‌ను(Smart glasses) మార్కెట్లోకి విడుదల చేసింది. ‘ఓక్లే మెటా వాన్‌గార్డ్’ పేరుతో తమ వార్షిక ‘మెటా కనెక్ట్ 2025’ ఈవెంట్‌లో వీటిని పరిచయం చేసింది. మూడు నెలల క్రితం వచ్చిన ఓక్లే మెటా(Meta) హెచ్‌ఎస్‌టీఎన్ మోడల్‌కు కొనసాగింపుగా, ఈ గ్లాసెస్‌ను మరింత అధునాతన ఫీచర్లతో రూపొందించారు.

ధర, విడుదల వివరాలు

ఈ స్మార్ట్ గ్లాసెస్ ధరను 499 డాలర్లుగా (సుమారు రూ. 43,500) నిర్ణయించారు. అక్టోబర్ 21 నుంచి అమెరికా, యూకే, కెనడాతో సహా 17 దేశాల్లో వీటి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది చివర్లో, రెండో దశలో భాగంగా భారత్‌తో పాటు మెక్సికో, బ్రెజిల్, యూఏఈ మార్కెట్లలోనూ వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు మెటా ప్రకటించింది. ఈ వాన్‌గార్డ్ మోడల్‌తో పాటు, మెటా తమ రే-బాన్ సిరీస్‌లోనూ కొత్త వెర్షన్‌లను ప్రకటించింది.

అధునాతన ఫీచర్లు, టెక్నాలజీ అనుసంధానం

రన్నర్లు, సైక్లిస్టుల(Cyclists) కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ గ్లాసెస్‌లో అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయి. 3కే వీడియో రికార్డింగ్ చేయగల 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, స్పష్టమైన ఆడియో కోసం ఐదు మైక్రోఫోన్‌ల వ్యవస్థ, గాలి శబ్దాన్ని తగ్గించే టెక్నాలజీ వంటివి ప్రధానమైనవి. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం దీనికి ఐపీ67 రేటింగ్‌ను ఇచ్చారు. ఈ గ్లాసెస్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే 9 గంటల పాటు పనిచేస్తాయని, చార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 36 గంటల బ్యాటరీ లైఫ్ ఉంటుందని కంపెనీ తెలిపింది. కేవలం 20 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్ పూర్తవుతుంది.

ఈ స్మార్ట్ గ్లాసెస్ గార్మిన్ స్మార్ట్‌వాచ్‌లతో సింక్ అవుతాయి. దీనివల్ల పరుగు వేగం, హృదయ స్పందనల రేటు వంటి వివరాలను రియల్ టైంలో అందిస్తాయి. ప్రముఖ ఫిట్‌నెస్ ప్లాట్‌ఫామ్ ‘స్ట్రావా’తో కూడా అనుసంధానం కావడం వల్ల వినియోగదారులు తమ పనితీరు డేటా(data)ను నేరుగా ఫొటోలు, వీడియోలపై ఓవర్‌లే చేసి సోషల్ మీడియాలో పంచుకోవచ్చు.

‘ఓక్లే మెటా వాన్‌గార్డ్’ గ్లాసెస్ ధర ఎంత?

ఈ గ్లాసెస్ ధర సుమారు రూ. 43,500.

ఈ గ్లాసెస్ ఎప్పుడు భారతదేశంలో అందుబాటులోకి వస్తాయి?

ఈ ఏడాది చివర్లో రెండో దశలో భాగంగా భారత్‌లో విడుదల కానున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/live-news-todays-latest-news-18-09-2025/live-news/549521/

fitness tech Google News in Telugu Latest News in Telugu Meta new product launch. Oakley Meta Vanguard smart glasses Telugu News Today Wearable Technology

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.