భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) నేతృత్వంలో నలుగురు సభ్యుల బృందం అంతరిక్ష ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. 18 రోజుల గగనయాత్ర అనంతరం వారు భూమికి సురక్షితంగా తిరిగొచ్చారు (They returned to Earth safely) . శుభాంశుతో పాటు ఇతర ముగ్గురు వ్యోమగాములు కూడా ఈ ప్రయాణంలో పాల్గొన్నారు.బృందం ప్రయాణించిన వ్యోమనౌక అమెరికాలోని కాలిఫోర్నియా సమీప సముద్రంలో సురక్షితంగా ల్యాండైంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 3:01కి వారు భూమిని తాకారు. భూమికి చేరుకున్న వెంటనే వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఏడురోజుల క్వారంటైన్‌కు తరలించారు.
జూన్ 25 నుంచి కీలక పరిశోధనలు చేపట్టిన బృందం
ఈ అంతరిక్షయాత్ర జూన్ 25న ప్రారంభమైంది. ఈ సమయంలో శుభాంశు శుక్లా బృందం అనేక ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది. శాస్త్రీయ పరిశోధనల విషయంలో శుభాంశు సరికొత్త రికార్డులు నెలకొల్పారు. 60కిపైగా ప్రయోగాల్లో ఆయన నేరుగా పాల్గొన్నారు.ఈ గగనయాత్ర మొత్తం 96.5 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్టు సమాచారం. అంతరిక్షంలో ఉన్న 18 రోజుల్లో వారు మొత్తం 230 సూర్యోదయాలను చూశారు. ఇది వారి మిషన్‌కు ప్రత్యేకతనిచ్చింది. ఈ పరిశోధనలు భవిష్యత్తు అంతరిక్ష మిషన్‌లకు దారిదీపంగా నిలుస్తాయని నిపుణులు పేర్కొన్నారు.
భారత వ్యోమగామి శుభాంశుకు శుభాకాంక్షల వర్షం
శుభాంశు శుక్లా విజయవంతంగా భూమికి చేరిన అనంతరం, దేశవ్యాప్తంగా శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయిగా ఈ ప్రయాణాన్ని పరిగణిస్తున్నారు. శుభాంశు చేసిన సేవ భారత అంతరిక్ష విజ్ఞానానికి గర్వకారణమని వ్యాఖ్యానిస్తున్నారు.
Read Also : Jaishankar: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను కలిసిన విదేశాంగ మంత్రి జైశంకర్