ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది కన్నడ భామ రష్మిక మందన్న. నేషనల్ క్రష్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ వయ్యారి. ఇప్పుడు చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉంటుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది.
Read Also: Most Popular Directors of 2025: ఐఎండీబీ.. ఈ ఏడాది మోస్ట్ పాపులర్ దర్శకుల జాబితా విడుదల
ప్రగతిశీల సమాజాన్ని నిర్మించడానికి AIని ఉపయోగించాలి
రీసెంట్ గా పుష్ప సినిమాతో, యానిమల్, ఛావా సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. అలాగే ఈ చిన్నది ఇప్పుడు బడా హీరోల సినిమాల్లోనూ నటిస్తుంది. ఇటీవలే హిందీలోసల్మాన్ ఖాన్ సరసన సికిందర్ సినిమాలో నటించింది ఆ సినిమా బోల్తా కొట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మిక మందన్న తన సినిమాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా రష్మిక మందన్న షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా రష్మిక (Rashmika Mandanna) ఏఐ వాడకం పై సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
బాధ్యతగా ఉండడం
‘AIని అభివృద్ధి కోసం కాకుండా కొందరు అశ్లీలతను సృష్టించడానికి, మహిళలను లక్ష్యంగా చేసేందుకు దుర్వినియోగం చేస్తున్నారు. AIని మంచి కోసం మాత్రమే వాడుకుందాం. ఇలాంటి దుర్వినియోగానికి పాల్పడేవారికి కఠిన శిక్ష విధించాలి’ అంటూ Xలో రష్మిక (Rashmika Mandanna) రాసుకోచ్చింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: