📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌ సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌

Solar Eclipse : మరో రెండేళ్లలో అరుదైన సూర్యగ్రహణం

Author Icon By Divya Vani M
Updated: July 18, 2025 • 7:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

2027 ఆగస్టు 2న ఆకాశంలో అరుదైన దృశ్యం (A rare sight in the sky on August 2, 2027) కనిపించనుంది. ఈ రోజు ‘గ్రేట్ నార్త్ ఆఫ్రికన్ ఎక్లిప్స్’ పేరుతో గుర్తింపు పొందనుంది. చంద్రుడు సూర్యుని పూర్తిగా కప్పేసి, భూమిపై 6 నిమిషాల 23 సెకన్ల పాటు చీకటి ఆవరించనుంది. ఇది ఈ శతాబ్దంలోనే అత్యంత దీర్ఘమైన సూర్యగ్రహణంగా నిలుస్తుంది.ఈ గ్రహణం అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా మొదలవుతుంది. అనంతరం ఇది యూరప్, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యంవైపు కదులుతుంది. స్పెయిన్‌లోని కాడిజ్, మలాగా వంటి ప్రాంతాల్లో 4 నిమిషాలకు పైగా చీకటి కనిపిస్తుంది.ఉత్తర మొరాకోలోని టాంజియర్, టెటౌవాన్, ఈజిప్ట్‌లోని లక్సర్ దగ్గర 6 నిమిషాలకు పైగా పూర్తిస్థాయి గ్రహణం ఉంటుందనీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జెడ్డా, మక్కా, యెమెన్, సోమాలియా ప్రాంతాల్లోనూ ఇది కనిపించనుంది.

Solar Eclipse : మరో రెండేళ్లలో అరుదైన సూర్యగ్రహణం

భారతదేశంలో గ్రహణం కనిపించదా?

ఈసారి మనకు దురదృష్టమే. ఈ గ్రహణం భారతదేశంలో పూర్తిగా కనిపించదు. తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లోనూ ఇది కనిపించదు. కొన్ని ప్రాంతాల్లో కేవలం అంచున మాత్రమే చూపు పడుతుంది.ఈ గ్రహణం అఫీలియన్ (భూమి సూర్యునికి దూరంగా ఉన్న స్థితి) సమయంలో జరుగుతుంది. అదే సమయంలో చంద్రుడు పెరిజీ (భూమికి దగ్గరగా ఉండే దశ)లో ఉంటాడు. దాంతో చంద్రుడు పెద్దగా, సూర్యుడు చిన్నగా కనిపిస్తాడు. ఫలితంగా గ్రహణం కాలవ్యవధి పెరుగుతుంది.ఇక, ఇది భూమధ్యరేఖ సమీపంలో ఉండటంతో చంద్రుని నీడ నెమ్మదిగా కదులుతుంది. అందువల్ల టోటలిటీ ఎక్కువసేపు ఉంటుంది.

ఎలా చూడాలి?

ఈ గ్రహణాన్ని సురక్షితంగా చూడాలంటే సోలార్ (Solar Eclipse) వ్యూయర్‌లు ఉపయోగించాలి. ISO 12312-2 ప్రమాణాల గల గ్లాసులు ధరించాలి. సాధారణ సన్‌గ్లాసెస్ ఉపయోగించకూడదు. పిన్‌హోల్ ప్రొజెక్టర్ వంటి పద్ధతులు కూడా ఉపయుక్తమే.ఈ గ్రహణం సమయంలో సూర్యుని కరోనాను పరిశీలించేందుకు మంచి అవకాశం లభిస్తుంది. ఇది సాధారణ రోజుల్లో సూర్యప్రకాశం వల్ల కనిపించదు. గ్రహణ సమయంలో మాత్రమే ఇది కనిపిస్తుంది. అందుకే, ఇది శాస్త్రీయంగా విలువైన ఘట్టంగా మారనుంది.

Read Also : INS Nistar : భారత నౌకాదళంలో చేరిన డీప్ సీ రెస్క్యూ నౌక ‘నిస్తార్’

Astronomy Celestial Event Eclipse Facts Great North African Eclipse Rare Solar Eclipse Science Updates Solar Eclipse 2027 Solar Eclipse Viewing

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.