Railway Track: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు

Read Time:  1 min
Railway Track: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు
FONT SIZE
GET APP

భారతీయ రైల్వే అటవీ జంతువుల రక్షణ దిశగా మరో కీలకమైన ముందడుగు వేసింది. అడవుల గుండా వెళ్లే రైల్వే ట్రాక్‌ (Railway Track) లపై తరచూ జరుగుతున్న జంతు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం పర్యావరణ పరిరక్షణతో పాటు వన్యప్రాణుల భద్రతకు ఎంతో ఉపయోగపడనుంది.

Read Also: AI 1 Pay: ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ 

Railway Department's key decision... AI cameras on tracks
Railway Department’s key decision… AI cameras on tracks

ఐడీఎస్ విజయవంతం

ఈ ఏఐ కెమెరాలు ట్రాక్‌పై జంతువులు ఉంటే లోకో పైలట్‌లకు 0.5 కిలోమీటర్ల దూరంలోనే సమాచారం అందిస్తాయి. ఇటీవల నార్త్-ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే సెక్షన్‌లో 141 కిలోమీటర్ల పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ (ఐడీఎస్) విజయవంతమైంది. దీంతో దేశవ్యాప్తంగా మరో 981 కిలోమీటర్ల మేర ఈ కెమెరాలను అమర్చాలని అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.