📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Telugu News: Phone Charger: జాగ్రత సుమా! ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు

Author Icon By Tejaswini Y
Updated: November 6, 2025 • 4:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మంచి నాణ్యత గల ఛార్జర్‌ ఉపయోగించడం మీ మొబైల్‌ ఫోన్‌(Phone Charger) పనితీరును మెరుగుపరచడమే కాకుండా, బ్యాటరీ మరియు పరికరానికి నష్టం వాటిల్లకుండా కాపాడుతుంది. అయితే, నకిలీ లేదా నాణ్యత లేని ఛార్జర్లు వాడటం వల్ల బ్యాటరీ జీవిత కాలం తగ్గడం, అతి వేడి పడి పరికరం దెబ్బతినడం, ఇంకా కొన్ని సందర్భాల్లో పేలుళ్లు సంభవించడం వంటి ప్రమాదాలు తలెత్తవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం వినియోగదారులను జాగ్రత్తగా ఉండమని సూచించింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ తమ అధికారిక ‘జాగో గ్రాహక్ జాగో’(Jago Grahak Jago) హ్యాండిల్‌ ద్వారా ఒక హెచ్చరిక పోస్టు విడుదల చేసింది. అందులో, “నాణ్యత లేని ఛార్జర్లు ప్రమాదకరమైనవే. ఎల్లప్పుడూ భద్రతా ప్రమాణాలు కలిగిన ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయండి. మీ ఛార్జర్‌ లేదా పరికరంపై ఉన్న CRS గుర్తు కేవలం గుర్తు కాదు, అది భద్రతా చిహ్నం. దాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దు,” అని పేర్కొంది.

Read Also: Singer Chinmayi: వైరల్ అవుతున్న సింగర్ చిన్మయి పోస్ట్

ఈ పోస్టులో ఇంకా, CRS గుర్తు లేని ఛార్జర్లు(Phone Charger) వాడటం ద్వారా ఫోన్‌ దెబ్బతినే ప్రమాదం మాత్రమే కాకుండా, వినియోగదారుడి ప్రాణ భద్రతకు కూడా ముప్పు ఏర్పడవచ్చని హితవు పలికింది. కాబట్టి వినియోగదారులు తక్కువ ధరకు లభించే నకిలీ ఛార్జర్లకు ఆకర్షితులు కాకుండా, ప్రామాణిక బ్రాండ్‌లు, సర్టిఫైడ్ ఉత్పత్తులు మాత్రమే వినియోగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

BatterySafety CRSCertification DigitalSafety FakeChargers JagoGrahakJago MobileChargerSafety MobileTips TechnologyAwareness Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.