📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: X: ఫేక్ అకౌంట్లను అరికట్టేందుకు ఎక్స్‌లో కొత్త ఫీచర్

Author Icon By Aanusha
Updated: November 22, 2025 • 9:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు, తప్పుడు సమాచార వ్యాప్తి… ఇవన్నీ ఈ కాలంలో సమస్యలుగా మారాయి. ఈ సమస్యకి, అడ్డుకట్ట వేసేందుకు ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’ (X) కీలక ముందడుగు వేసింది. ‘అబౌట్ దిస్ అకౌంట్’ పేరుతో ఒక సరికొత్త ఫీచర్‌ను యూజర్ల ముందుకు తీసుకొచ్చింది. దీని ద్వారా ఏదైనా ఖాతా యొక్క విశ్వసనీయతను సులభంగా అంచనా వేయవచ్చు.

Read Also: Job Skills: దేశంలోపెరిగిన ఉద్యోగ నైపుణ్యాలు

ఈ ఫీచర్ ప్రస్తుతం దశలవారీగా యూజర్లందరికీ అందుబాటులోకి వస్తోందని ఎక్స్ వర్గాలు వెల్లడించాయి.ప్రస్తుతం ఎక్స్ (X) ప్లాట్‌ఫామ్‌పై ఫేక్ అకౌంట్లు, ఆటోమేటెడ్ బాట్‌ల బెడద తీవ్రంగా ఉంది. అసలు ఖాతాలను పోలిన నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి, వాటి ద్వారా సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే కంటెంట్, జాతి వ్యతిరేక పోస్టులు, రాజకీయ దుష్ప్రచారాలు విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయి.

ఉదాహరణకు, భారతీయుడిగా చెప్పుకుంటూ పోస్టులు పెట్టే ఒక ఖాతాను నిజంగా భారతదేశం నుంచే నిర్వహిస్తున్నారా లేక విదేశాల్లోని శక్తులు మన దేశం నుంచి ఆపరేట్ చేస్తున్నట్టు భ్రమింపజేస్తున్నాయా అనేది తెలుసుకోవడం సాధారణ యూజర్లకు కష్టసాధ్యంగా మారింది. ఇలాంటి మోసపూరిత కార్యకలాపాలను నియంత్రించడమే ఈ కొత్త ఫీచర్ ప్రధాన లక్ష్యం.

కొత్త ఫీచర్ ప్రధాన లక్ష్యం

యూజర్లు ఏదైనా ప్రొఫైల్‌ను సందర్శించినప్పుడు, అక్కడ కనిపించే ‘అబౌట్ దిస్ అకౌంట్’ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఆ ఖాతాకు సంబంధించిన కీలక సమాచారం కనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా నాలుగు అంశాలు ఉంటాయి:

New feature in X to curb fake accounts

జాయినింగ్ తేదీ: ఆ ఖాతా ఎక్స్‌లో ఎప్పుడు సృష్టించబడింది అనే విషయం తెలుస్తుంది. ఇటీవలే సృష్టించి, వివాదాస్పద పోస్టులు పెడుతుంటే అనుమానించే ఆస్కారం ఉంటుంది.
లొకేషన్: ఖాతాను ఏ దేశం నుంచి నిర్వహిస్తున్నారనేది ఈ ఫీచర్ స్పష్టంగా చూపిస్తుంది. ఇది విదేశాల నుంచి జరిగే దుష్ప్రచారాలను గుర్తించడానికి కీలకంగా ఉపయోగపడుతుంది.

మంచి ముందడుగు

యూజర్‌నేమ్ మార్పులు: ఒక ఖాతా తన యూజర్‌నేమ్‌ను ఎన్నిసార్లు మార్చింది, చివరిసారిగా ఎప్పుడు మార్చింది అనే వివరాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ప్రముఖులు, సంస్థల పేర్లతో ఇతరులను మోసం చేసేందుకు (ఇంపర్సనేషన్) యూజర్‌నేమ్‌లు మార్చే వారికి ఇది చెక్ పెడుతుంది.కనెక్షన్ సోర్స్: ఈ ఖాతా గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ వంటి అధికారిక ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఎక్స్‌కు కనెక్ట్ అయిందా అనే విషయం తెలుస్తుంది.

నిజానికి, ఇలాంటి ఫీచర్ సోషల్ మీడియా ప్రపంచానికి కొత్తేమీ కాదు. మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో ఇప్పటికే ఈ తరహా సౌలభ్యం అందుబాటులో ఉంది. ఇప్పుడు వాటి బాటలోనే ఎక్స్ కూడా పయనిస్తూ, తన ప్లాట్‌ఫామ్‌పై పారదర్శకతను, యూజర్ల భద్రతను పెంచేందుకు ప్రయత్నిస్తోంది. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, ద్వేషపూరిత ప్రచారాలను అరికట్టడంలో ఇది ఒక మంచి ముందడుగు అని టెక్ నిపుణులు, యూజర్లు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

About this account fake accounts control latest news misinformation prevention Telugu News X new feature

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.