📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త

Telugu news: Motorola Edge 70: వైర్‌లెస్ ఛార్జింగ్‌తో కొత్త మోటరోలా ఫోన్

Author Icon By Tejaswini Y
Updated: December 15, 2025 • 4:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Smartphone Launch in India: మోటరోలా తన ఎడ్జ్ సిరీస్‌ను మరింత విస్తరించుతూ భారత మార్కెట్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చే మోటరోలా ఎడ్జ్ 70(Motorola Edge 70)ను సోమవారం అధికారికంగా లాంచ్ చేసింది. స్టైలిష్ డిజైన్‌తో పాటు శక్తివంతమైన ఫీచర్లతో రూపొందిన ఈ ఫోన్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులోకి రానుంది.

Read Also: ChatGPT 5.2: గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2.. దీనిలో  కొత్తగా ఏముంది? 

రూ.29,999కే మోటరోలా ఎడ్జ్ 70 విడుదల

భారత్‌లో ఈ ఫోన్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ కలిగిన ఒకే వేరియంట్‌లో విడుదలైంది. దీని ధరను రూ.29,999గా నిర్ణయించారు. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1,000 వరకు తక్షణ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. డిసెంబర్ 23 నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటరోలా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు రిటైల్ స్టోర్లలో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్ పాంటోన్ బ్రాంజ్ గ్రీన్, పాంటోన్ గాడ్జెట్ గ్రే, పాంటోన్ లిల్లీ ప్యాడ్ కలర్ ఆప్షన్లలో లభించనుంది.

50MP కెమెరాలతో మోటరోలా ఎడ్జ్ 70

ఫీచర్ల విషయానికి వస్తే, మోటరోలా ఎడ్జ్ 70(Motorola Edge 70)లో 6.7 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 7i రక్షణ ఉంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో యూఐపై రన్ అవుతుంది.

ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా (OISతో), 50MP అల్ట్రా వైడ్ కెమెరా ఇవ్వగా, ముందుభాగంలో 50MP సెల్ఫీ కెమెరాను అందించారు. 5000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో పాటు 68W వైర్డ్, 15W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇందులో ఉంది.\స్టైలిష్ డిజైన్‌తో మోటరోలా కొత్త ఎడ్జ్ సిరీస్ ఫోన్

స్టైలిష్ డిజైన్‌తో మోటరోలా కొత్త ఎడ్జ్ సిరీస్ ఫోన్

అదనంగా IP68, IP69 వాటర్–డస్ట్ రెసిస్టెన్స్, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, మోటో ఏఐ ఫీచర్లు ఉన్నాయి. కేవలం 159 గ్రాముల బరువు, 5.99 మిమీ మందంతో ఈ ఫోన్ ఎంతో స్లిమ్‌గా రూపొందించారు. మూడు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, నాలుగేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లు అందిస్తామని మోటరోలా ప్రకటించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Motorola Edge 70 Motorola Edge Series Motorola New Mobile Smartphone Launch India Wireless Charging Phone

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.