మాల్దీవ్స్‌కు(Maldives) కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్‌ను ‘గ్రోక్’ యాప్ తప్పుగా అనువదించడం వివాదానికి దారి తీసింది. మోదీ ట్వీట్‌ను అనువదించిన విధానం అసలు భావానికి పూర్తిగా భిన్నంగా ఉండటంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
Read Also: Tech Updates: వాట్సాప్ ప్రైవసీపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
అసలు ట్వీట్ భావం ఇదే
‘రిపబ్లిక్ డే వేడుకలు మాల్దీవ్స్‌లో జరిగాయి. సుకురియా ప్రభుత్వం భారత వ్యతిరేక చర్యల్లో పాల్గొంటోంది’ అన్నట్లు గ్రోక్ ట్రాన్స్‌లేషన్ ఇచ్చింది. అయితే వాస్తవంగా ప్రధాని మోదీ, భారత్–మాల్దీవ్స్(Maldives) రెండు దేశాలు పరస్పర ప్రయోజనాల కోసం కలిసి ముందుకు సాగాలని, మాల్దీవుల ప్రజలకు శాంతి, అభివృద్ధి, ఆనందంతో నిండిన భవిష్యత్తు కలగాలని ఆకాంక్షించారు.
అనువాదంపై విమర్శలు
తప్పు అనువాదం వల్ల అనవసరమైన అపోహలు ఏర్పడుతున్నాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అంతర్జాతీయ అంశాల్లో ఖచ్చితమైన అనువాదం అవసరమని, టెక్నాలజీ వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: