📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News:Jishnu Dev Varma: టెక్నాలజీ మానవాళికి ఉపయోగపడాలి

Author Icon By Pooja
Updated: October 8, 2025 • 11:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ (గచ్చిబౌలి) : టెక్నాలజీ మానవాళికి ఉపయోగపడే విధంగా ఉండాలని, దానిని భర్తీ చేయకూడదని తెలంగాణ రాష్ట్ర గవర్నర్, హెచ్ సియు చీఫ్ రెక్టార్ జిష్ణుదేవ్ వర్మ(Jishnu Dev Varma) అభిప్రాయపడ్డారు. విద్య సమాజంలో సమ గ్రమైన, అందరికీ సమానమైన సమాజాన్ని నిర్మిం చే విధంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూని వర్సిటీ 25వ స్నాతకోత్సవ వేడుకలను మంగళ వారం బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాల యం ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు.

Read Also: Sandalwood: తిరుపతి టూ ఢిల్లీ ఎర్ర చందనం స్మగ్లింగ్

ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో(Jishnu Dev Varma) కలిసి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, ఎక్జిక్యూటీవ్ చైర్మన్ క్రిష్ణ ఎల్లా ముఖ్యఅతిధులుగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఈ సంవత్సరం మొత్తం 1717మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లు ప్రక టించగా, అందులో 990 మంది తమ పట్టాలను అందుకున్నారు. అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్వర్మ మాట్లాడుతూ మెరుగైన భవిష్యత్తుకు ఆలోచన, విద్యార్థుల కష్టానికి వేడుకగా స్నాత కోత్సవాన్ని అభివర్ణిం అభివర్ణించారు. మానవుడి ఉనికి అంతిమ లక్ష్యం మేధస్సును పెంచడమే కావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటలను ఊటం కించారు.

నేటి యువతకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని(Technology) సమాజానికి, తోటి వారికీ సేవ చేసేందుకు ఉపయోగించాలని సూచించారు. పట్టాలు అందుకున్న గ్రాడ్యుయేట్లు వినయాన్ని వదులుకోవద్దని, ఇతరులకు అవకాశాలు సృష్టించే విధంగా ఎదగాలని పిలుపునిచ్చారు. భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు క్రిష్ణ ఎల్లా మాట్లాడుతూ భారతదేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలంటే మన యువత ఆవిష్కరణలు, నైపుణ్యం మీద దృష్టి సారించాలని సూచించారు. విశ్వవిద్యాలయం డిగ్రీ పట్టాను ఇస్తుందని, కానీ ఉత్తమ ఆవిష్కరణ, నైపూణ్యం జీవితంలో ముం దుకు తీసుకువెళ్తాయని అన్నారు.

నేటి విద్యార్థులు ఉద్యోగాల వేటలో పడి ఉద్యోగ అన్వేషకులుగా మారుతున్నారని, ఉద్యోగ సృష్టికర్తలుగా మారా లని పిలుపునిచ్చారు. దేశంలో ఉన్న సామాజిక సమస్యలకు పరిష్కారాలను కనుగొనాలని సూచించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో భారతీయ శాస్త్రవేత్తల సందేహాలు వ్యక్తం చేశారని, కానీ కోవిడ్ వ్యాక్సిన్ను సొంతంగా తయారు చేసి భారతీయుల సైనను, మేధోసంపత్తిని ప్రపం చానికి చూపించామన్నారు. హెచ్సీయు వైస్ చాన్సిలర్ బిజె.రావు మాట్లా డుతూ హైదరాబాద్సెంట్రల్ యూనివర్సిటీ ఒక విశ్వవిద్యాలయం మాత్రమే కాదని, ఇది ఒక గ్రీన్ క్యాంపస్ అని అన్నారు.

ప్రపంచ క్యూఎస్ ర్యాంకింగ్స్ లో హెచ్సీయు గత సంవత్సరం ఉన్న 372 నుంచి ఈ సంవత్సరం 335కు చేరిందని తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, నూతన టెక్నాల జీలో సవాళ్లను పరిష్కరించేందుకు 6 విశ్వవిద్యాల యాలను అనుసంధానం చేస్తూ 100కోట్లతో ఏర్పాటు చేసిన ఎఎన్ఆర్ఎఫ్ ప్రాజెక్టుకు హెచ్సీయు నాయకత్వం వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా దృష్టి లోపాన్ని అధిగమించి ఎం.ఎ. పొలిటికల్ సైన్స్ పట్టా అందుకున్న విద్యార్థిణి గోపితేజస్వీక్ ఓబిసి కేటగిరి గోల్డ్మె డల్ను అందజేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Jishnu Dev Varma Latest News in Telugu Technology Telugu News Paper Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.