📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల.. పరీక్ష తేదీలు ఇవే!

Author Icon By Sai Kiran
Updated: January 17, 2026 • 9:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

JEE Main 2026 : జేఈఈ మెయిన్‌ 2026 సెషన్‌-1 పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) శనివారం విడుదల చేసింది. ఈ నెల 21, 22, 23, 24 తేదీల్లో జరగనున్న పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in లో అందుబాటులో ఉంచినట్లు ఎన్టీఏ తెలిపింది.

దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 పరీక్షలు జనవరి 21, 22, 23, 24 మరియు 28 తేదీల్లో నిర్వహించనున్నారు. పేపర్‌-2 పరీక్ష జనవరి 29న జరుగుతుంది. ప్రస్తుతానికి తొలి నాలుగు రోజులకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులనే విడుదల చేయగా, 28, 29 తేదీల పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు తర్వాత విడుదల చేయనున్నట్లు ఎన్టీఏ స్పష్టం చేసింది.

ఈ పరీక్షలు రోజుకు రెండు షిఫ్టుల్లో జరుగుతాయి. (JEE Main 2026) మొదటి షిఫ్టు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్టు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు.

Read also : Ahmedabad Flight Crash Case : ఫ్లైట్ క్రాష్ కేసు.. AAIBకి FIP లీగల్ నోటీసులు

అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ విధానం:

అభ్యర్థులు jeemain.nta.nic.in వెబ్‌సైట్‌కు వెళ్లి హోమ్‌పేజీలో ఉన్న ‘JEE Main Admit Card 2026 Session-1’ లింక్‌పై క్లిక్‌ చేయాలి.
అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్‌ అవ్వాలి.
అడ్మిట్‌ కార్డు స్క్రీన్‌పై కనిపించిన వెంటనే ప్రింట్‌ తీసుకోవాలి.
కార్డులో పరీక్ష తేదీ, కేంద్రం, షిఫ్టు వంటి వివరాలు సరిగా ఉన్నాయో లేదో తప్పకుండా పరిశీలించాలి.
ఏవైనా సమస్యలు ఉంటే jeemain@nta.ac.in కు మెయిల్‌ ద్వారా సంప్రదించాలని ఎన్టీఏ సూచించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu engineering entrance exam India Google News in Telugu JEE Main 2026 admit card JEE Main download admit card JEE Main exam dates 2026 JEE Main paper 1 paper 2 JEE Main session 1 hall ticket jeemain.nta.nic.in Latest News in Telugu NTA JEE Main 2026 Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.