Instagram: 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్

Read Time:  1 min
Instagram
Instagram
FONT SIZE
GET APP

సోషల్ మీడియా వేదిక Instagram చిన్నారుల భద్రత దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు వినియోగదారులు ఆత్మహత్యకు సంబంధించిన కంటెంట్‌ను వెతికితే, వారి తల్లిదండ్రులకు వెంటనే సమాచారం వెళ్లేలా ప్రత్యేక అలర్ట్ వ్యవస్థను తీసుకురానుంది.

Read Also:WhatsApp Down: వెబ్ డౌన్: టెక్నికల్ సమస్యతో వినియోగదారుల అవస్థలు

Instagram
Instagram: Instagram’s new safety alert for users under 16

ఈ కొత్త ఫీచర్ ముందుగా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లో వచ్చే వారం నుంచి అందుబాటులోకి రానుంది. యువతపై సోషల్ మీడియా ప్రభావం పెరుగుతుందనే ఆందోళనల నేపథ్యంలో Meta Platforms ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

యువత సోషల్ మీడియా వినియోగంపై పెరుగుతున్న చర్చ

ఇటీవలి కాలంలో పలుదేశాలు యువత సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణలు విధించే అవకాశాలను పరిశీలిస్తున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా, స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా వంటి దేశాలు కఠిన నిబంధనలపై ఆలోచిస్తున్నాయి. భారత్‌లోనూ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాలు సోషల్ మీడియా వినియోగంపై పరిమితుల దిశగా చర్చలు ప్రారంభించినట్లు సమాచారం. యువత మానసిక ఆరోగ్యాన్ని కాపాడటమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యంగా భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.