భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) జనవరి 27 నుంచి అమల్లోకి రానుంది. ఈ ఒప్పందం(Indian Market) అమలుతో యూరప్ నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే లగ్జరీ కార్లపై విధించే కస్టమ్స్ డ్యూటీ గణనీయంగా తగ్గనుంది.
Read Also: Penguin Story: ఒంటరి పెంగ్విన్ వీడియో.. నేటి మనసులకు అద్దం
ఇప్పటివరకు లగ్జరీ కార్లపై ఉన్న 110 శాతం దిగుమతి సుంకాన్ని 40 శాతానికి తగ్గించనున్నారు. దీనివల్ల మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి వంటి ప్రీమియం కార్ల ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఏడాదికి 2 లక్షల కార్లకే వర్తింపు
అయితే ఈ సుంకం(Indian Market) తగ్గింపు ఏడాదికి గరిష్టంగా 2 లక్షల వాహనాలకు మాత్రమే పరిమితం. అలాగే ఎలక్ట్రిక్ కార్లపై తొలి ఐదేళ్ల పాటు ఈ పన్ను సడలింపు వర్తించదు అని ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ఎఫ్‌టీఏ వల్ల భారతీయ వినియోగదారులకు అంతర్జాతీయ స్థాయి లగ్జరీ కార్లు మరింత అందుబాటులోకి రానున్నాయి. అదే సమయంలో విదేశీ ఆటోమొబైల్ కంపెనీల పెట్టుబడులు భారత్ వైపు మళ్లే అవకాశాలు కూడా పెరుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: