📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మెట్రోకు స్కైవాక్‌లు ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్ మెట్రోకు స్కైవాక్‌లు ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్

Hyderabad: మెట్రోకు స్కైవాక్‌లు.. ప్రయాణ సమయం గణనీయంగా తగ్గింపు

Author Icon By Pooja
Updated: January 23, 2026 • 10:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌లో(Hyderabad) కోటి మందికి పైగా ప్రజలు నివసిస్తున్న నేపథ్యంలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. నగర ప్రజలు సులభంగా, వేగంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకునేలా రవాణా సౌకర్యాలను ఆధునికీకరించనుంది.

Read Also:Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ అనేది రొటీన్ – KTR

Hyderabad: Skywalks for the Metro; travel time to be significantly reduced.

ఈ క్రమంలో హైదరాబాద్‌లో(Hyderabad) ప్రజా రవాణాను పూర్తిగా అప్‌గ్రేడ్ చేసే దిశగా ప్రభుత్వం మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ సేవలను ఒకే నెట్‌వర్క్‌గా అనుసంధానం చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా ప్రయాణ సమయం తగ్గడంతో పాటు దూర ప్రయాణాలు మరింత సులభంగా మారనున్నాయి.

మెట్రో దిగగానే బస్సులు, ఎంఎంటీఎస్ అందుబాటులోకి

కొత్త ప్రణాళికల ప్రకారం, మెట్రో స్టేషన్‌లో దిగగానే ఆర్టీసీ బస్సులు సిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు. అలాగే ఎంఎంటీఎస్ స్టేషన్లకు నేరుగా చేరుకునేలా సౌకర్యాలు కల్పించనున్నారు. ఇదే విధంగా ఎంఎంటీఎస్ స్టేషన్ నుంచి బయటకు రాగానే మెట్రో స్టేషన్లు, బస్టాప్‌లు దగ్గర్లో ఉండేలా వ్యవస్థను రూపొందిస్తున్నారు. ఇందుకోసం స్కైవాక్‌లు, స్కైవేలను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటివరకు మెట్రో స్టేషన్ నుంచి ఎంఎంటీఎస్ స్టేషన్ లేదా బస్టాప్‌కు చేరుకోవాలంటే కొంత దూరం నడవాల్సి వచ్చేది. కొత్త ఏర్పాట్లతో అన్ని సేవలు ఒకేచోట లభించనున్నాయి.

స్కైవాక్‌లతో నేరుగా స్టేషన్ల అనుసంధానం

మెట్రో స్టేషన్ల నుంచి కిందకు దిగకుండానే నేరుగా ఎంఎంటీఎస్ స్టేషన్లకు చేరుకునేలా స్కైవాక్‌లు, స్కైవేలు నిర్మించనున్నారు. బేగంపేట, నాంపల్లి, భరత్‌నగర్, ఖైరతాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఈ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, మెట్రో స్టేషన్, సమీప బస్టాప్‌లను ఒకే మార్గంతో అనుసంధానం చేసేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. మెట్రో స్టేషన్ నుంచి నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకునేలా స్కైవాక్ నిర్మాణం చేపట్టనున్నారు.

ఎంఎంటీఎస్ స్టేషన్ల వద్ద బస్టాప్‌లు, బ్యాటరీ వాహనాలు

ప్రస్తుతం నగరంలో 51 ఎంఎంటీఎస్ స్టేషన్లు ఉండగా, వాటిలో కేవలం 21 స్టేషన్ల దగ్గర మాత్రమే బస్టాప్‌లు ఉన్నాయి. దీంతో ప్రయాణికులు ఎంఎంటీఎస్ దిగిన తర్వాత బస్టాప్‌కు చేరుకోవడానికి నడవాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులను తొలగించేందుకు బస్టాప్‌లను ఎంఎంటీఎస్ స్టేషన్లకు మరింత దగ్గరగా మార్చనున్నారు. బస్టాప్‌లు దూరంగా ఉన్న ప్రాంతాల్లో ప్రయాణికుల కోసం తక్కువ చార్జీలతో బ్యాటరీ వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటితో ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ మెరుగుపడనుంది.

క్షేత్రస్థాయిలో అధ్యయనం

ఈ మొత్తం ప్రణాళికలను అమలు చేయడానికి హెచ్‌ఎండీఏ పరిధిలోని యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేపడుతోంది. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని జరుగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu MetroRail MMTS PublicTransport

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.