Hole On The Sun: సూర్యుడి ఉపరితలంపై ఇటీవల కనిపించిన ప్రత్యేకమైన “సీతాకోకచిలుక ఆకారపు” కొరొనల్ హోల్ ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ అయింది. NASA విడుదల చేసిన హై-రిజల్యూషన్ చిత్రాల్లో ఈ రంధ్రం స్పష్టంగా కనిపించింది. సెప్టెంబరులోనే శాస్త్రవేత్తలు దీన్ని గమనించారు గానీ, ఇప్పుడు బయటకు వచ్చిన తాజా చిత్రాలు సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతున్నాయి. దాదాపు మూడు లక్షల మైళ్ల పొడవుతో ఉన్న ఈ ఖాళీ సూర్యుడి (sun) ఉపరితలంపై విస్తరించి ఉండటం ఆశ్చర్యకరం.
Read also: Saudi Arabia: ప్రమాదంలో మరణించిన మృతదేహాలను స్వదేశానికి తీసుకొస్తారా?
Hole On The Sun Is the Sun going to die
కొరొనల్ హోల్స్ అంటే సూర్యుడి మాగ్నెటిక్ ఫీల్డ్‌లో ఏర్పడే పెద్ద పెద్ద ఖాళీలు. ఈ ప్రాంతాల నుంచి వేగంగా కణాలు అంతరిక్షంలోకి ప్రవహిస్తాయి. సెప్టెంబరులో ఇదే రంధ్రం భూమివైపు వచ్చినప్పుడు అలాస్కా, కెనడా వంటి ప్రాంతాల్లో ఉత్తర దీపాలు మరింత ప్రకాశవంతంగా కనిపించాయి. సూర్యుడు ప్రస్తుతం అత్యంత చురుకైన దశలో ఉన్నందున, ఇటువంటి మార్పులు కనిపించడం సహజమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సీతాకోకచిలుక ఆకారపు రంధ్రం
ఈ సీతాకోకచిలుక ఆకారపు రంధ్రం ఫోటోలు బయటకు రావడంతో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు దీన్ని సరదాగా మీమ్స్‌గా మార్చుతుండగా, మరికొందరు భూమికి ఇది ప్రమాదకరమా అని ఆందోళన చెందుతున్నారు. అయితే నాసా స్పష్టంగా తెలిపినట్టు ఇలాంటి రంధ్రాలు తరచూ కనిపిస్తాయి, కొన్ని రోజుల తర్వాత స్వయంగా మాయమవుతాయి. ఆకారం అసాధారణంగా ఉండటం వల్లే ఈసారి ఇది అంత పెద్ద చర్చకు దారితీసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: