ఇస్రో కొత్త ప్రయోగం కోసం సిద్ధమైంది. జీఎస్ఎల్వీ F-16 రాకెట్ కౌంట్‌డౌన్ (GSLV F-16 Rocket Countdown) ప్రారంభమైంది. ఈ రాకెట్ రేపు సాయంత్రం 5.40 గంటలకు శ్రీహరికోటలో (The rocket will launch tomorrow at 5.40 pm in Sriharikota)ని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండో లాంచ్‌పాడ్ నుంచి అంతరిక్షంలోకి దూసుకెళ్తుంది.ఈ ప్రయోగంలో నిసార్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు. నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ, ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ కలిసి ఈ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశాయి. ప్రపంచంలోనే మొదటి డ్యూయల్-ఫ్రీక్వెన్సీ రాడార్ ఉపగ్రహం ఇదే. ఇది L-బ్యాండ్, S-బ్యాండ్ SAR టెక్నాలజీతో పనిచేస్తుంది.(GSLV F16 Nisar)

ఏ పరిస్థితుల్లోనైనా ఫొటోలు తీయగల సామర్థ్యం
నిసార్ పగలు, రాత్రి అన్ని వాతావరణాల్లో ఫొటోలు తీస్తుంది. మేఘాలు, వర్షం ఉన్నా కూడా స్పష్టమైన చిత్రాలను పంపగలదు. ఇది అధిక రెజల్యూషన్ ఫొటోలు, డేటాను అందిస్తుంది.నిసార్ స్కాన్లు భూకంపాలు, వరదలు, కొండచరియలు వంటి పరిస్థితులను గుర్తించడంలో సహాయపడతాయి. తీరప్రాంత మార్పులు, నేల తేమ, వ్యవసాయ నమూనాలను కూడా ఇది ట్రాక్ చేస్తుంది.
శాస్త్రవేత్తలకు, ప్రభుత్వాలకు మేలు
నిసార్ నుంచి వచ్చే డేటా, ఫొటోలు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలకు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఇస్రో చైర్మన్ నారాయణన్ ప్రకారం, ఈ ఉపగ్రహం 12 రోజుల్లో భూమి మొత్తం మ్యాప్ చేయగలదు.నిసార్‌లోని S-బ్యాండ్ సింథటిక్ అపెర్చర్ స్వదేశీ టెక్నాలజీతో తయారైంది. L-బ్యాండ్ సింథటిక్ అపెర్చర్‌ను నాసా రూపొందించింది. ఈ ఉపగ్రహం పంటల పెరుగుదల, నీటి వినియోగం వంటి సమాచారం కూడా అందిస్తుంది.
Read Also : Nimisha Priya : నిమిష కు మరణశిక్షను రద్దు చేసిన యెమెన్