📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌ సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌

Google Gemini: ఘిబ్లీ ఇమేజెస్ ఇప్పుడు గూగుల్ జెమినీ తో..ఎలా అంటే?

Author Icon By Sharanya
Updated: March 31, 2025 • 5:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రఖ్యాత జపనీస్ యానిమేషన్ స్టూడియో ఘిబ్లీ ప్రత్యేక శైలి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. స్టూడియో ఘిబ్లీ చేసిన ‘స్పిరిటెడ్ అవే’, ‘మై నెయిబర్ టోటోరో’, ‘ద బోయ్ అండ్ ద హెరాన్’ వంటి చిత్రాల శైలి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కలిగి ఉంది. వాటర్‌కలర్ టెక్స్చర్, సున్నితమైన రంగులు, డ్రీమీ బ్యాక్‌డ్రాప్‌లు, నేచురల్ లైటింగ్, ఫాంటసీ ఎలిమెంట్స్ – ఇవన్నీ ఘిబ్లీ చిత్రాలను ప్రత్యేకంగా నిలిపే అంశాలు. ఇప్పుడు, ఆ కళా శైలిని మీ ఫోటోలకూ అందుబాటులోకి తెస్తోంది గూగుల్ జెమినీ AI. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ద్వారా, మీరు మీ వ్యక్తిగత చిత్రాలను స్టూడియో ఘిబ్లీ లాంటి యానిమే స్టైల్‌లోకి మార్చుకోవచ్చు. అది కూడా చాలా ఈజీ!

స్టూడియో ఘిబ్లీ స్టైల్ ఫోటో ఎలా రూపొందించాలి?

1గూగుల్ జెమినీ (gemini.google.com) వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి లేదా iOS/Androidలో Gemini App డౌన్‌లోడ్ చేసుకుని లాగిన్ అవ్వండి.

2-అప్‌లోడ్ బటన్‌ను క్లిక్ చేసి మీ ఫోటోను ఎంచుకోండి. వ్యక్తులు, పెంపుడు జంతువులు, ప్రకృతి దృశ్యాలున్న ఫోటోలు ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. హై-రిజల్యూషన్ చిత్రాలు ఉంటే మరింత మెరుగైన అవుట్‌పుట్ వస్తుంది.

3-టెక్స్ట్ ప్రాంప్ట్ బాక్స్‌లో ఈ విధంగా వివరణాత్మక ప్రాంప్ట్ ఇవ్వండి. ఈ ఫోటోను మృదువైన పాస్టెల్ రంగులతో, డ్రీమీ బ్యాక్‌డ్రాప్‌తో స్టూడియో ఘిబ్లీ-శైలి యానిమేషన్లా మార్చండి. మరింత ప్రత్యేకత కావాలనుకుంటే – ఎండమావులున్న ఆకాశం, గంభీరమైన అడవి వాతావరణం, నదీ తీరాన ప్రశాంతమైన సాయంత్రం వంటి అంశాలను కూడా జోడించొచ్చు.

4-మీ ప్రాంప్ట్‌ను జెమినికి పంపించగానే, కొన్ని క్షణాల్లోనే ఫోటోను AI ప్రాసెస్ చేసి యానిమే స్టైల్‌లోకి మార్చేస్తుంది.

5-ప్రధమ అవుట్‌పుట్ మీకు నచ్చకపోతే, మరిన్ని మార్పులు కోరుతూ ఈ విధంగా సూచనలు ఇవ్వొచ్చు. ఆర్ట్‌స్టైల్ మరింత ఘిబ్లీ లా ఉండేలా మెరుగుపరచండి. హయావో మియాజాకి సినిమా వాతావరణంలా రంగుల్ని మెరుగుపరచండి. బాల్యపు నెమలీకలను తలపించేలా లైటింగ్ మార్చండి.

6-చివరిగా, మీ ఫోటోను “Download” లేదా “Save Image” ఆప్షన్ ద్వారా స్టోర్ చేసుకోవచ్చు. మీ పూర్తయిన చిత్రాన్ని సేవ్ చేయడానికి డెస్క్‌టాప్‌లో కుడి వైపున క్లిక్ చేయండి. మొబైల్ లో అయితే ఎక్కువ సేపు ప్రెస్ చేస్తే సేవ్ అవుతుంది.

#AestheticAnime #AIArt #AnimeVibes #GhibliStyle #googleai #GoogleGemini #MagicOfGhibli #StudioGhibli Google news Google News in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Telugu News Paper Telugu News Today Today news Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.