ఇటీవల గూగుల్ ఒక కీలక హెచ్చరికను విడుదల చేసింది.జీమెయిల్‌లోని కొన్ని సాంకేతిక లోపాలను సైబర్ నేరగాళ్లు తమ ప్రయోజనాలకు వాడుకుంటున్నట్లు వెల్లడించింది.వినియోగదారులను మోసం చేయడానికి నమ్మశక్యంగా కనిపించే నకిలీ మెయిల్స్, ఫోన్ కాల్స్‌ను ఉపయోగిస్తున్నారని పేర్కొంది.దీనిపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని గూగుల్ హితవు చెప్పింది.ఈ దాడుల వెనుక ఉన్న వ్యూహం చాలా క్రమబద్ధమైనది.గూగుల్ పేరుతో, గూగుల్ మెయిల్ స్టాండర్డ్స్‌ను అనుసరిస్తున్నట్టు కనిపించే నకిలీ మెయిల్స్ వినియోగదారులకు వస్తున్నాయి. వాటిలో డీకేఐఎం సిగ్నేచర్ కూడా ఉండటంతో అవి నిజమైనవిగా కనిపిస్తున్నాయి.ఒక డెవలపర్‌కు ఇటువంటి నకిలీ “లీగల్ నోటీసు” మెయిల్ వచ్చింది. అది నిజంగా గూగుల్ నుంచే వచ్చిందని తొలుత నమ్మిపోయారు. కానీ ఆ మెయిల్ లక్ష్యం వారి లాగిన్ వివరాలను దోచుకోవడం. కొన్నిసార్లు హ్యాకర్లు పూర్తిగా ఖాతాను స్వాధీనం చేసుకొని పాస్‌వర్డ్, రికవరీ ఎంపికలను మార్చేస్తున్నారు.గూగుల్ ప్రకారం, ఇప్పుడు పాస్‌వర్డ్‌లు మాత్రమే సరిపోవు. రెండు దశల భద్రతా వ్యవస్థ కూడా ఎప్పుడైనా దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే ‘పాస్‌కీ’ అనే కొత్త భద్రతా పరిష్కారాన్ని వినియోగించుకోవాలని గూగుల్ సిఫార్సు చేసింది. పాస్‌కీ అనేది ప్రత్యేక పరికరంతో పని చేసే సెక్యూరిటీ వ్యవస్థ. ఇది ఫింగర్‌ప్రింట్, ఫేస్ రికగ్నిషన్ లేదా పిన్ ఆధారంగా పనిచేస్తుంది. ఫిషింగ్ దాడుల నుంచి ఇది మెరుగైన రక్షణను అందించగలదని గూగుల్ చెప్పింది.
వినియోగదారులకు గూగుల్ సూచిస్తున్న భద్రతా చర్యలు
పాస్‌కీ సెటప్ చేయండి – జీమెయిల్‌లో ఇది తప్పనిసరిగా చేసుకోవాలి.
గూగుల్ ప్రాంప్ట్ వాడండి – ఎస్ఎంఎస్ వెరిఫికేషన్‌కు బదులుగా ఇది సురక్షితం.
రికవరీ వివరాలు జోడించండి – ఫోన్ నంబర్, ఈ-మెయిల్ తప్పకుండా చేర్చండి.
నకిలీ మెయిల్స్‌కు క్లిక్ చెయ్యవద్దు – అనుమానాస్పద లింకులు తెరవొద్దు.
పాస్‌వర్డ్ మార్పు చేయండి – తక్షణంగా కొత్త పాస్‌వర్డ్ పెట్టండి.
గూగుల్ తీసుకున్న జాగ్రత్తలు
ఈ హ్యాకింగ్ మోసాన్ని గమనించిన వెంటనే గూగుల్ తగిన సెక్యూరిటీ అప్‌డేట్‌ను విడుదల చేసింది. అయినప్పటికీ, వినియోగదారులవంతుగా మేము కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న తప్పిదం వల్ల ఖాతా పూర్తిగా దొంగలచేతికి చేరే అవకాశం ఉంది.అందుకే, జీమెయిల్ ఖాతాలను మరింత సురక్షితంగా ఉంచేందుకు, పై సూచనలను పాటించడం అత్యంత అవసరం. సైబర్ మోసాల నుంచి మన డేటాను కాపాడుకోవడానికి ఇది సరైన సమయం.
Read Also : IPL 2025: ఆర్‌సీబీ విజయం పై స్పందించిన కోహ్లీ