Engineers Day-సర్.ఎం.విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా ఇంజినీర్ల డే‘ జరుగుతున్నది. భారతదేశంలో ఇంజినీరింగ్ విభాగంలో ఆయన సేవలను ఈ సందర్భంగా మోదీ కొనియాడారు. విశ్వేశ్వరయ్య దేశానికి ఎనలేని సేవలను అందించారని, నేటి యువతకు ఆయన మార్గదర్శకుడని మోదీ అన్నారు. ‘తమ సృజనాత్మకత, దృఢ సంకల్పం ద్వారా, నూతన ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడంతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న ఇంజినీర్లందరికీ నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెబుతున్నాను’ అని ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ(Modi) తన గ్రీటింగ్ను తెలిపారు.
అపారమైన సేవల్ని అందించిన మహానేత
సమాజం, అభివృద్ధికి(Society Development) ఇంజినీర్ల లోతైన సహకారాన్ని గుర్తించి జరుపుకోవడం వలన ఇది గణనీయమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. సెప్టెంబరు 15వ తేదీన ఇంజినీర్ల దినోత్సవంగా పాటించడం వలన విశ్వేశ్వరయ్య దేశానికి చేసిన సేవల్ని స్మరించుకోగలుతాం. అపారమైన సేవల్ని అందించిన మహానేతగా ఆయనను నేటికీ గుర్తుంచుకుంటారు. మనదేశం గర్వించేలా ఆయన ఎన్నో ఆవిష్కరణలు చేశారు.
ప్రధాని మోదీ ఎవరికీ నివాళులర్పించారు?
ప్రధాని నరేంద్ర మోదీ, ప్రముఖ ఇంజనీర్ మరియు భారతరత్న పురస్కార గ్రహీత సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు నివాళులర్పించారు.
విశ్వేశ్వరయ్య ఎందుకు ప్రసిద్ధి పొందారు?
విశ్వేశ్వరయ్య ఆధునిక భారత నిర్మాణానికి కీలకమైన ప్రణాళికలు, ఇంజనీరింగ్ కృషితో ప్రసిద్ధి చెందారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: