📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌ సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌

Donald Trump : ఏఐ క్రియేటివిటీ సూప‌ర్‌

Author Icon By Divya Vani M
Updated: April 17, 2025 • 4:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒక్క‌సారి ఊహించుకోండి అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏపీలో ఉంటే ఎలా ఉండేదో? ఆయ‌న చంద్ర‌బాబుతో కలిసి బీచ్‌పై కొబ్బ‌రి తాగుతూ, పూత‌రేకులు తింటూ, పిల్ల‌ల‌తో గోలీలు ఆడుతూ కనిపిస్తే ఎలా ఉంటుంది? ఇదంతా నిజం కాదు, కానీ చూసిన‌ వాళ్లంద‌రూ నమ్మినంత రియ‌ల్‌గా ఉన్న వీడియో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో దుమ్ము రేపుతోంది.ఇది నిజంగా జరిగినదేమీ కాదు, కానీ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో సృష్టించిన ఈ వీడియో ఒక cinematic ఫీల్ ఇస్తోంది. ట్రంప్ ఏపీలో ఉన్నట్లు చూపిస్తూ రూపొందించిన ఈ వీడియోలో, చంద్ర‌బాబుతో కలిసి ఆయన రోడ్ షోలో పాల్గొనడం, సైకిల్ రైడ్ చేయడం, బీచ్ పక్కన నలుగురు గజిబిజీగా మాట్లాడుకోవడం, అన్నీ చూసినవాళ్లను ఆశ్చర్యపరుస్తున్నాయి.వీడియోలో ట్రంప్ కొబ్బ‌రి బోండాలు తాగుతూ చంద్రబాబుతో ముచ్చ‌టించ‌డం, పూత‌రేకులు రుచి చూస్తూ ఆనందపడడం చూపారు.

Donald Trump ఏఐ క్రియేటివిటీ సూప‌ర్‌

ఇంకా పిల్లలతో కలిసి గోలీలు ఆడుతున్న సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎంతో సహజంగా, ఆహ్లాదంగా చూపించడంలో ఈ వీడియో క్రియేట‌ర్ అస‌లు టాలెంట్ చూపించారు. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి వీడియోను చాలా నచ్చేలా ఎడిట్ చేశారు.ఈ వీడియోను ‘టీడీపీ ట్రెండ్స్’ అనే ఎక్స్ (ట్విట్టర్) ఖాతా మొదట షేర్ చేసింది. దాని తరువాత ఈ వీడియో క్షణాల్లో వైర‌ల్ అయింది. నెటిజ‌న్లు దీన్ని తెగ షేర్ చేస్తూ, ఫన్నీ కామెంట్స్‌తో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది దీన్ని పొలిటిక‌ల్ సెటైర్‌గా తీసుకుంటే, మరికొంతమంది వినోదంగా ఆస్వాదిస్తున్నారు.వీడియో చూసినవాళ్లు తమదైన స్టైల్‌లో స్పందిస్తున్నారు.

ట్రంప్ కంటే చంద్ర‌బాబు స్టైలిష్‌గా ఉన్నారు” అంటూ కామెంట్లు పెట్టారు.మరికొంద‌రు “ఇది ఏపీ టూరిజం అడ్వర్ట్‌లా ఉంది” అంటున్నారు. కొంత‌మంది అయితే “ట్రంప్ బాబు ఫ్రెండ్షిప్ కోసం వేరే సినిమా తీయొచ్చు” అంటూ జోక్స్ వేస్తున్నారు.ఈ వీడియో మరోసారి ఏఐ టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో చూపిస్తోంది. ఇలాంటి క్రియేటివ్ కాన్సెప్ట్‌లతో ప్రజలకు వినోదం అందించ‌డం తప్ప, దానిని తప్పుగా వాడ‌కపోతే చాలా ఉపయోగంగా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.ట్రంప్ నిజంగా ఏపీలోకి రాకపోయినా, ఈ ఏఐ వీడియో మాత్రం అందర్నీ ఏపీలో పర్యటింపజేసింది. హ్యూమర్, క్రియేటివిటీ, టెక్నాలజీ – మూడు కలిసి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఇదే ఉదాహరణ. ఈ వీడియోని మీరు ఇంకా చూడలేదా? అయితే వెంటనే ‘టీడీపీ ట్రెండ్స్’ ఎక్స్ ఖాతాలో చూడండి… మీరు కూడా ఖచ్చితంగా స్మైల్ చేస్తారు!

AI Funny Telugu Videos Donald Trump AP AI Video TDP Trends Twitter Trump Chandrababu Viral Video Trump Coconut Water Video Trump in Andhra Pradesh Viral Political Video Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.