ప్రపంచవ్యాప్తంగా మరోసారి సైబర్ సెక్యూరిటీ(Cyber Security) కలవరపెడుతోంది. ఆస్ట్రేలియా సైబర్ సెక్యూరిటీ నిపుణుడు ట్రాయ్ హంట్ ప్రకారం, తాజాగా జరిగిన భారీ డేటా ఉల్లంఘనలో 183 మిలియన్లకు పైగా ఈమెయిల్ పాస్‌వర్డ్‌లు లీక్ అయినట్లు ధృవీకరించారు. వీటిలో Gmail, Yahoo, Outlook వంటి ఖాతాల వివరాలు కూడా ఉన్నాయని వెల్లడించారు.
Read Also: Canada:సింగర్ చన్నీ నట్టన్ ఇంటిపై కాల్పుల బాధ్యత మాదే: బిష్ణోయ్
ఈ డేటా మాల్‌వేర్ ద్వారా దొంగిలించబడిందని, హ్యాకర్లు సుమారు 3.5 టెరాబైట్ల డేటాను (875 HD సినిమాల సమానం) సేకరించారని ట్రాయ్ వివరించారు. దాంతో అనేక మంది వినియోగదారుల లాగిన్ వివరాలు, పాస్‌వర్డ్‌లు, మరియు వ్యక్తిగత సమాచారాలు బహిర్గతమయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. ట్రాయ్ హంట్ నిర్వహిస్తున్న “Have I Been Pwned” వెబ్‌సైట్ ద్వారా వినియోగదారులు తమ ఈమెయిల్ ఖాతాలు లీక్ అయ్యాయో లేదో తనిఖీ చేసుకోవచ్చని, లీక్ అయినట్లయితే వెంటనే పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలని, రెండు దశల భద్రత (2FA) ప్రారంభించాలని సూచించారు.
భవిష్యత్తులో ఇలాంటి సైబర్(Cyber Security) దాడులను నివారించేందుకు పాస్‌వర్డ్‌లను తరచూ మార్చడం, అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకపోవడం, మరియు యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించడం అవసరం అని నిపుణులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: