OLAపై కస్టమర్లు ఫైర్!

Follow Us: Google News Daily Hunt
OLAపై కస్టమర్లు ఫైర్!
FONT SIZE
GET APP

OLA : ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) సర్వీస్ కేంద్రాల నిర్వహణ తీరుపై కస్టమర్ల నుంచి దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో అసంతృప్తి వెల్లువెత్తుతోంది. స్పేర్ పార్ట్‌ల (Spare parts) తీవ్ర కొరత కారణంగా వేలాది స్కూటర్లు నెలల తరబడి సర్వీసింగ్ కేంద్రాల్లోనే నిలిచిపోయి మూలనపడుతున్నాయి. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఉన్న ఒక సర్వీస్ సెంటర్‌లో దాదాపు 500కు పైగా ఓలా స్కూటర్లు దిక్కుదివాణా లేకుండా ఎండకూ, వానకూ నానుతూ తుప్పు పట్టిపోతున్నాయని, కంపెనీ యాజమాన్యం దీనిపై తీవ్ర ఉదాసీనత వహిస్తోందని ఒక బాధితుడు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. కొనుగోలు చేసిన కొద్ది రోజులకే సాంకేతిక సమస్యలు తలెత్తడం, వాటికి పరిష్కారం చూపడంలో నెలకు పైగా జాప్యం చేయడంపై వాహనదారులు విమర్శలు గుప్పిస్తున్నారు.

Read Also : భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్ బ్యాన్ కానుందా? వైరల్ వార్తపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత!

నిరాశలో కస్టమర్లు: వాహనాలు తగలబెడుతున్న ఘటనలతో ఆందోళన

సర్వీస్ సెంటర్ల చుట్టూ తిరిగినా కంపెనీ ప్రతినిధుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో కస్టమర్ల నిరసనలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. సుదీర్ఘ నిరీక్షణ, బాధ్యతారాహిత్యమైన సమాధానాలతో విసిగిపోయిన కొందరు వినియోగదారులు ఆక్రోశంతో తమ ఓలా స్కూటర్లకు బహిరంగంగానే నిప్పు పెట్టి తగలబెట్టిన సంఘటనలు తీవ్ర కలకలం రేపాయి. కోట్ల రూపాయలు వెచ్చించి ఈ-స్కూటర్లను కొనుగోలు చేసిన తమకు కనీస సర్వీసింగ్ సదుపాయం కూడా అందించలేకపోవడంపై కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు. సేవల నాణ్యతను మెరుగుపరచకపోతే ఓలా పట్ల కస్టమర్లలో నమ్మకం పూర్తిగా సడలిపోయే ప్రమాదం ఉందని రవాణా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు