ChatGPT Virtual Try On: ఇక ఆన్‌లైన్ షాపింగ్ మరింత ఈజీ.. వర్చువల్ ట్రై-ఆన్తో

Follow Us: Google News Daily Hunt
A virtual 'try-on' feature will be available on ChatGPT starting October 2. It allows you to upload your photo and virtually try on clothes using AI to see how they look.
A virtual 'try-on' feature will be available on ChatGPT starting October 2. It allows you to upload your photo and virtually try on clothes using AI to see how they look.
FONT SIZE
GET APP

ChatGPT Virtual Try On: ఆన్‌లైన్ షాపింగ్ అనుభవాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లేందుకు ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘ఓపెన్ ఏఐ’ (OpenAI) భాగాస్వామ్యంతో కీలక ఫీచర్‌ను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ప్రజాదరణ పొందిన ‘చాట్‌జీపీటీ’ (ChatGPT) చాట్‌బాట్‌లో దుస్తులు, యాక్సెసరీలను వర్చువల్‌గా ధరించి చూసుకునే (Virtual Try-On) సదుపాయాన్ని అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది. ఈ సరికొత్త ఫీచర్ నేటి నుంచే (అక్టోబర్ 2, 2026) ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చింది.

Read Also :Apple Pay: యాపిల్ పే భారత్‌లోకి వచ్చేసిన యాపిల్ పే..పిన్, ఓటీపీ లేకుండానే పేమెంట్స్ !!

ChatGPT Virtual Try On: ‘ట్రై-ఆన్’ ఎలా పనిచేస్తుంది? ఫీచర్ కీలక విశేషాలు ఇవే!

ChatGPT Virtual Try On

యూజర్లు తమ పూర్తి నిలువు ఫొటో లేదా సెల్ఫీని ఒకసారి అప్‌లోడ్ చేసి, షాపింగ్ ఫలితాల్లో కనిపించే ‘ట్రై-ఆన్’ (Try-On) బటన్‌ను క్లిక్ చేస్తే సరిపోతుంది. ఏఐ సాంకేతికత ద్వారా ఆ దుస్తులు మీపై ఎలా ఉంటాయో క్షణాల్లో చూపిస్తుంది. ఇతర ఇ-కామర్స్ వెబ్‌‌సైట్ల నుండి తీసుకున్న స్క్రీన్‌షాట్‌లను లేదా సెలబ్రిటీల ఫొటోలను అప్‌లోడ్ చేసి కూడా అలాంటి దుస్తులను చాట్‌జీపీటీ ద్వారా శోధించి వర్చువల్‌గా ప్రయత్నించవచ్చు. ఈ ప్రాసెస్ కోసం ఓపెన్ ఏఐ అధునాతన ‘ChatGPT Images 2.5’ మోడల్‌ను ఉపయోగిస్తోంది. ఇది సహజమైన లైటింగ్, డిజైన్ టెక్స్చర్లను చాలా క్లారిటీతో, వేగంగా రూపకల్పన చేస్తుంది. నచ్చిన అవుట్‌ఫిట్‌లను, ట్రై-ఆన్ ఫొటోలను ‘ఫేవరైట్స్’ లైబ్రరీలో సేవ్ చేసుకునే వెసులుబాటు ఉంది. మొబైల్ యాప్ మరియు వెబ్ ఇంటర్‌ఫేస్ రెండింటిలోనూ ఈ ఫీచర్ పనిచేస్తుంది. సెట్టింగ్స్‌లోకి వెళ్లి అప్‌లోడ్ చేసిన రిఫరెన్స్ ఫొటోలను యూజర్లు ఎప్పుడైనా రీప్లేస్ చేయడం లేదా పూర్తిగా తొలగించడం చేయవచ్చు.

Read Also hindi  news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు