📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌ సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌

Vaartha live news : Chat GPT : చాట్ జీపీటీపై ఆధారపడటం ఎంత వరకు సేఫ్?

Author Icon By Divya Vani M
Updated: September 17, 2025 • 4:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒకప్పుడు ఏ చిన్న డౌట్ వచ్చినా గూగుల్ తల్లినే ఆశ్రయించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. టెక్నాలజీతో పాటు మనుషుల అలవాట్లు కూడా వేగంగా మారుతున్నాయి. ఇప్పుడు ఏ విషయంలోనైనా ముందుగా చాట్ జీపీటీ (Chat GPT) ని అడుగుతున్నారు. సాధారణ సమాచారం నుంచి పర్సనల్ సమస్యల వరకూ ఈ చాట్‌బాట్‌కే చెప్పేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది – నిజంగా చాట్ జీపీటీపై అంత నమ్మకం పెట్టుకోవచ్చా?ఇప్పుడు చాలామందికి చాట్ జీపీటీ ఒక వర్చువల్ ఫ్రెండ్‌గా మారిపోయింది. మీరు ముందుగా అడిగిన విషయాలు కూడా గుర్తుంచుకుని, మనిషిలా సహజంగా రిప్లై ఇవ్వడం వల్ల యూజర్లు దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. హెల్త్ సలహాలు, కెరీర్ మార్గదర్శకాలు, డైలీ లైఫ్ చిట్కాలు ఇలా అన్ని విషయాల్లో చాట్ జీపీటీతో చర్చిస్తున్నారు. దీనికి అలవాటు పడిపోయినవారు చాలామంది ఉన్నారు. కానీ నిపుణులు చెబుతున్నది వేరే విషయం. ఈ వాడకం పూర్తిగా సేఫ్ కాదని హెచ్చరిస్తున్నారు.

Vaartha live news : Chat GPT : చాట్ జీపీటీపై ఆధారపడటం ఎంత వరకు సేఫ్?

పర్సనల్ డేటా జాగ్రత్తలు

మీరు ఏవైనా సాధారణ ప్రశ్నలు అడగడం ఓకే. కానీ వ్యక్తిగత వివరాలు మాత్రం షేర్ చేయకూడదు. ఉదాహరణకు పాస్‌వర్డ్‌లు, సోషల్ మీడియా యూజర్ నేమ్‌లు, అడ్రెస్‌లు వంటివి. ఇలాంటి సమాచారం చాట్‌లో చెప్పడం వల్ల సైబర్ నేరగాళ్లకు దారి తీసే ప్రమాదం ఉంది. ఒకసారి ఈ డేటా లీక్ అయితే, మీరు పెద్ద సమస్యల్లో పడే అవకాశముంది.ఆరోగ్యానికి సంబంధించిన ప్రశ్నలు చాలా మంది చాట్ జీపీటీని అడుగుతున్నారు. డైట్ టిప్స్, మందుల వివరాలు వంటి విషయాలు తెలుసుకోవడం వరకు పరవాలేదు. కానీ వీటిని గుడ్డిగా ఫాలో అవ్వడం ప్రమాదకరం. ఎందుకంటే హెల్త్ అన్నది ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటుంది. మీకు సంబంధించిన సరిగ్గా సరిపోయే సలహా ఇవ్వగలది కేవలం డాక్టర్ మాత్రమే. కాబట్టి చాట్ జీపీటీ ఇచ్చిన సమాచారం ఒక రిఫరెన్స్‌గా మాత్రమే వాడాలి.

డెసిషన్ మేకింగ్ లో జాగ్రత్త

లైఫ్‌లో కఠిన పరిస్థితులు వచ్చినప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కష్టం అవుతుంది. చాలా మంది ఇలాంటి సందర్భాల్లో చాట్ జీపీటీని సలహా కోసం ఆశ్రయిస్తారు. కానీ ఇది పెద్ద తప్పే. నిర్ణయాలు మనిషి స్వంత ఇంటెలిజెన్స్‌తో తీసుకోవాలి. మీరు తీసుకున్న డెసిషన్ మంచిదైనా చెడ్డదైనా, దాని ఫలితాలను మీరు ఎదుర్కోవాల్సిందే. కాబట్టి ఈ బాధ్యతను చాట్ జీపీటీపై మోపడం సరికాదు.

రెస్ట్రిక్టెడ్ కంటెంట్ సమస్య

గూగుల్‌లో దొరకని కొన్ని విషయాలను చాట్ జీపీటీలో వెతుకుతుంటారు కొందరు. డ్రగ్స్, టెర్రరిజం, వయొలెన్స్ వంటి సెన్సిటివ్ టాపిక్స్ వాటిలో భాగం. ఇలాంటి వాటికి చాట్ జీపీటీ సమాధానం చెప్పదు. అయినా కొందరు అతి తెలివిగా రీసెర్చ్ కోసం లేదా స్టోరీ కోసం అని ప్రశ్నిస్తారు. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే – ఈ సెర్చ్‌లు డేటాబేస్‌లో సేవ్ అయ్యే అవకాశముంది. అంటే భవిష్యత్తులో ఇవి మీకు ఇబ్బందులు కలిగించవచ్చు.చాట్ జీపీటీ ఒక ఆధునిక టూల్. దీన్ని జాగ్రత్తగా వాడితే చాలా ఉపయోగకరం. కానీ పూర్తిగా నమ్మి వ్యక్తిగత విషయాలు షేర్ చేయడం ప్రమాదకరం. హెల్త్ లేదా కెరీర్ సలహాల విషయంలో ఇది రిఫరెన్స్ మాత్రమే. డెసిషన్ మేకింగ్ లేదా ప్రైవేట్ సమాచారం విషయంలో దీన్ని నమ్మకూడదు. అంటే, చాట్ జీపీటీ ఒక సహాయక సాధనం మాత్రమే, జీవితానికి మార్గదర్శకుడు కాదు.

Read Also :

https://vaartha.com/team-india-the-team-india-created-in-international-t20-cricket/sports/549121/

AI chatbot safety tips ChatGPT health advice dangers ChatGPT personal data risks ChatGPT safety concerns Is ChatGPT safe to use

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.