ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) భవిష్యత్తుపై ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ (Sam Altman) కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే దశాబ్దంలో ఏఐ ప్రభావం మన ఊహలకు మించి ఉంటుందని, ముఖ్యంగా 2030 నాటికి మానవ మేధస్సును మించిపోయే స్థాయికి చేరుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Xiaomi 17: Xiaomi 17, 17 Pro మరియు 17 Pro Max విడుదల.
సమీప భవిష్యత్తులోనే 40 శాతం ఉద్యోగాలను భర్తీ చేయగలదని ఆయన సంచలన అంచనా వేశారు.ఈ ఏడాదికి గాను ప్రతిష్ఠాత్మక యాక్సెల్ స్ప్రింగర్ అవార్డు (Axel Springer Award) ను అందుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. ఒకప్పుడు కేవలం సైన్స్ ఫిక్షన్ కథలకే పరిమితమైన ఏఐ ఇప్పుడు ప్రతి పనిలోనూ భాగమైందని గుర్తుచేశారు.
“2030 నాటికి మనం చేయలేని పనులను చేసే అసాధారణ సాంకేతికత (Unusual technology) మన వద్ద ఉంటుందని నేను నమ్ముతున్నాను” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మానవ పరిధికి మించిన ఆవిష్కరణలను ఏఐ త్వరలోనే చేయగలదని ఆయన పేర్కొన్నారు.
నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ముఖ్యమని
అయితే, సాంకేతిక అభివృద్ధి సానుకూల అంశమే అయినప్పటికీ ఇది ఉద్యోగ విఫణిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన అంగీకరించారు. ఏఐ (AI) రాకతో కొన్ని రంగాల్లోని ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగవుతాయని, అదే సమయంలో మరికొన్ని రంగాల్లో పూర్తిగా కొత్త తరహా ఉద్యోగాలు పుట్టుకొస్తాయని వివరించారు.
ఈ మార్పుల నేపథ్యంలో ఏది వచ్చినా దాన్ని స్వీకరించి, నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ముఖ్యమని శామ్ ఆల్ట్‌మన్ సూచించారు. భవిష్యత్తులో రాబోయే సాంకేతిక మార్పులకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని ఆయన పరోక్షంగా హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: