Whatsapp Username Feature : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో తీసుకురానున్న ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌పై యూజర్లలో నెలకొన్న భద్రతాపరమైన అపోహలు, వివాదాలపై మాతృసంస్థ మెటా కీలక వివరణ ఇచ్చింది. సాధారణంగా యూజర్‌నేమ్ ఫీచర్ అందుబాటులోకి వస్తే, మొబైల్ నంబర్ లేకుండా కేవలం ఐడీ తెలిస్తే చాలు ఎవరైనా మెసేజ్ చేసి ఇబ్బంది పెట్టవచ్చనే ఆందోళన వినియోగదారుల్లో వ్యక్తమైంది. దీనిపై స్పందించిన వాట్సాప్, వినియోగదారుల వ్యక్తిగత భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేసింది. గుర్తుతెలియని వ్యక్తులు నేరుగా కాంటాక్ట్ కాకుండా నిరోధించడానికి యూజర్‌నేమ్‌తో పాటు అదనంగా ‘యూజర్‌నేమ్ కీ’ (Username Key) అనే సరికొత్త ప్రైవసీ ఫీచర్‌ను కూడా జోడిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
Read Also : గ్లోబల్‌గా యూజర్‌నేమ్ ఫీచర్‌ను లాంచ్ చేసిన మెటా.. ఎలా సెట్ చేసుకోవాలి?

‘యూజర్‌నేమ్ కీ’ ప్రత్యేకత: అపరిచితుల మెసేజ్‌లకు చెక్
ఈ సరికొత్త సెక్యూరిటీ మెకానిజం ప్రకారం.. వాట్సాప్‌లో ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకున్నప్పుడు, ఒక కొత్త వ్యక్తి మిమ్మల్ని సంప్రదించాలంటే కేవలం మీ యూజర్‌నేమ్ తెలిస్తే సరిపోదు, దానితో పాటు మీ ‘కీ’ కూడా ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఈ యూజర్‌నేమ్ మరియు సెక్యూరిటీ కీలను యూజర్లు తమకు నచ్చినప్పుడు మార్చుకునే (రీసెట్) సదుపాయం కూడా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కొత్త వ్యక్తి ఈ ఐడీ, కీ ఉపయోగించి మెసేజ్ చేయడానికి ప్రయత్నిస్తే, వారి పూర్తి వివరాలను స్క్రీన్‌పై చూపిస్తూ వాట్సాప్ సదరు యూజర్‌ను ముందే అలర్ట్ చేస్తుంది. దీనివల్ల ప్రైవసీ దెబ్బతినకుండా, మొబైల్ నంబర్ ఇతరులకు షేర్ చేయాల్సిన అవసరం లేకుండానే సురక్షితంగా చాటింగ్ చేసుకోవచ్చని సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :