📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త

New Phone : కొత్త ఫోన్ కొంటున్నారా? ఇవి గుర్తుంచుకోండి!

Author Icon By Sudheer
Updated: July 29, 2025 • 11:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కొత్త ఫోన్ కొనే సమయంలో చాలా మంది ముందుగా తమ అవసరాలకన్నా ఫోన్ బ్రాండ్‌(Phone Brand)ను చూస్తారు. అయితే ముందుగా మన బడ్జెట్‌ను నిర్ణయించుకోవడం చాలా అవసరం. ప్రస్తుతం మార్కెట్లో రూ.15,000–25,000 మధ్య చాలా మంచి ఫీచర్లతో కూడిన బ్రాండెడ్ ఫోన్లు లభ్యమవుతున్నాయి. ఎలాంటి వాడుకకు ఫోన్ కావాలి? రోజువారీ ఉపయోగానికి సరిపోతుందా లేక గేమింగ్, ఫొటోగ్రఫీ కోసం కావాలా? అనే అంశాలపై స్పష్టత కలిగిన తర్వాతే కొనుగోలు నిర్ణయం తీసుకోవాలి.

ప్రాధాన్యతలపై ఫోకస్ చేయాలి

ఫోన్ ఎంపికలో కెమెరా క్లారిటీ, బ్యాటరీ సామర్థ్యం, ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం, డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్, స్టోరేజ్ సామర్థ్యం వంటి అంశాలు కీలకం. ముఖ్యంగా ఎక్కువగా ఫొటోలు తీయాలనుకునే వారు మంచి కెమెరా గల ఫోన్‌ను ఎంచుకోవాలి. దీర్ఘకాలం బ్యాటరీ అవసరమైన వారు ఎక్కువ mAh సామర్థ్యం గల బ్యాటరీను కోరుకోవాలి. అలాగే ఫోన్ వేగంగా ఛార్జ్ అయ్యేలా ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉండే ఫోన్‌ మంచిది. డిస్‌ప్లే పరంగా AMOLED లేదా 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లేలు మరింత ఆకర్షణీయంగా ఉంటాయి.

అవసరమైన ఫీచర్లకే ప్రాధాన్యత ఇవ్వాలి

చాలా సార్లు మనం వాడకపోయే, తక్కువగా ఉపయోగించే ఫీచర్లున్న ఫోన్లకే ఎక్కువ ఖర్చు చేస్తున్నాం. ఉదాహరణకు కొన్ని హైఎండ్ ఫీచర్లు విద్యార్థులకు అవసరం ఉండకపోవచ్చు. అలాంటి వాటికి అధిక ధర పెట్టడం అనవసరం. విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు అయినవారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెమరీ మేనేజ్మెంట్, డేటా ప్రైవసీ వంటి అంశాలు ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి. అంతేకాకుండా భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఫోన్‌కి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ సపోర్ట్ ఉన్నదా అన్నదీ పరిశీలించాలి.

Read Also : Rahul Gandhi : మోదీ, ట్రంప్ ని అబద్ధాల కోరు అని పిలవాలి: రాహుల్ గాంధీ

brand Google News in Telugu New Phone New Phone price

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.