BITS Pilani Amaravati : రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న బిట్స్ పిలానీ దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్గా ఉండబోతోందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్కు ఆ సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. అధునాతన సాంకేతికతో పాటు వ్యవసాయం నుంచి వాతావరణం, ఆరోగ్య సంరక్షణ వంటికోర్సులు సైతం ఇక్కడ ఉండేలా ప్రణాళికలు రూపొం దిస్తున్నట్లు మంత్రి లోకేశ్కు వారు వివరించారు. శుక్రవారం ఉండవల్లిలోని మంత్రి లోకేశ్ నివాసంలో ఆయనతో బిట్స్ పిలానీ ప్రతినిధులు సమా వేశమయ్యారు. ఈ సందర్భంగా బిట్స్ చేపట్టిన నిర్మాణ ప్లాన్లను లోకేశ్ పరి శీలించిసంతృప్తి వ్యక్తం చేశారు.
Read Also : Amaravati: అమరావతిలో ఐదేళ్లలో రూ.1000కోట్ల పెట్టుబడి
సాధ్యమైనంత త్వరగా అమరావతి క్యాంపస్ ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని వారికి మంత్రి లోకేశ్ వారిని కోరారు. ఈ సందర్భంగా బిట్స్ పిలానీ ప్రతినిధులు మాట్లాడుతూ ఏఐ, డేటా సైన్స్, రోబోటిక్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ తదితర కోర్సులు అమరావతి క్యాంపస్లో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రెండు దశల్లో 7వేల మంది విద్యార్థులకు అవకాశం కల్పించేలా అమరావతి బిట్స్ పిలాని నిర్మాణాలను చేపడుతున్నామనిచెప్పారు. ఈ క్యాంపస్పై వచ్చే ఐదేళ్ల లో రూ.1000కోట్ల పెట్టుబడి పెడతామని వారు ఈ సందర్భంగా వివరిం చారు. అలాగే సీఎం చంద్రబాబు దార్శనికతకు అనుగుణంగా నెక్ట్స్ జెన్ టెక్నాలజీలతో ఈ క్యాంపస్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఈ నిర్మాణంలో గ్రీన్ బిల్డింగ్, రెన్యువబుల్ ఎనర్జీ వంటి పర్యావరణహిత విధానాలను పాటిస్తున్నామని తెలిపారు. బిట్స్ ప్రతినిధులు సిద్ధార్థ బెనర్జీ, ఎన్. చెన్నవీర్, బీఎస్ సహాని తదితరులు మంత్రి లోకేశ్ను కలిసిన వారిలో ఉన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :