Artificial Vision: శాశ్వత అంధత్వంతో బాధపడుతున్న వారికి ఇప్పుడు వైద్య శాస్త్రం ఒక అద్భుతమైన ఆశను చూపిస్తోంది. ‘ప్రిమా’ (PRIMA) అనే వైర్‌లెస్ రెటీనా (Retina) ఇంప్లాంట్ సాయంతో చూపు కోల్పోయినవారు మళ్లీ ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు. వయో సంబంధిత మాక్యులర్ డిజెనరేషన్ (AMD) అనే వ్యాధితో అంధులైన రోగులపై ఈ టెక్నాలజీ అద్భుత ఫలితాలు చూపుతోంది. తాజాగా పూర్తయిన క్లినికల్ ట్రయల్స్‌లో, 32 మంది రోగులపై ఈ పరికరం పరీక్షించారు. వారిలో 27 మంది రోగులు మళ్లీ అక్షరాలు, పదాలు గుర్తించే స్థాయిలో చూపును పొందినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. అంటే 80 శాతం విజయశాతం సాధించింది. యూనివర్సిటీ కాలేజ్ లండన్, పిట్స్‌బర్గ్ యూనివర్సిటీ, స్టాన్‌ఫోర్డ్ మెడిసిన్ పరిశోధకులు కలిసి ఈ పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీ కళ్లద్దాలు, కెమెరా, కంటిలో అమర్చిన సూక్ష్మ చిప్ ఆధారంగా పనిచేస్తుంది. కళ్లద్దాల్లోని కెమెరా బయటి దృశ్యాలను గుర్తించి ఇన్‌ఫ్రారెడ్ కాంతి రూపంలో కంటిలోని చిప్‌కి పంపుతుంది. ఆ చిప్ ఆ సంకేతాలను విద్యుత్ రూపంలో మార్చి, రెటీనాలో మిగిలిన కణాలను ఉత్తేజపరిచి మెదడుకు పంపుతుంది. దీంతో రోగులు మళ్లీ వస్తువులను చూడగలుగుతారు.
Read also: Ashwini Vaishnav: గ్లోబల్ మార్కెట్లో సత్తా చాటుతున్న భారత్

PRIMA: ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు
ఈ పరిశోధనలో పాల్గొన్న పిట్స్‌బర్గ్ యూనివర్సిటీ ఆప్తమాలజీ విభాగం అధిపతి డాక్టర్ జోస్-అలైన్ సాహెల్ మాట్లాడుతూ, “చూపును తిరిగి తెప్పించే ప్రయత్నాల్లో ఇది చరిత్రాత్మక విజయంగా చెప్పుకోవచ్చు. రోగుల్లో చాలామంది ఇప్పుడు అక్షరాలు, పుస్తకాలు కూడా చదవగలుగుతున్నారు,” అని అన్నారు. ఈ అధ్యయనం వివరాలను “న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్” ప్రచురించింది. ఈ ప్రయోగాల్లో పాల్గొన్న రోగుల్లో 84% మంది తమ రోజువారీ జీవితంలో ఈ కృత్రిమ దృష్టిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఒక రోగి 12 లైన్ల వరకూ చదివినట్లు నమోదు కావడం ఈ ప్రాజెక్టు విశేషంగా నిలిచింది.
PRIMA అంటే ఏమిటి?
PRIMA అనేది వైర్‌లెస్ రెటీనా ఇంప్లాంట్ (wireless retina implant). ఇది కంటిలో అమర్చే సూక్ష్మ చిప్ రూపంలో ఉంటుంది. చూపును కోల్పోయిన వారికి మళ్లీ చూడగల శక్తిని ఇస్తుంది.
ఈ టెక్నాలజీని ఎవరు అభివృద్ధి చేశారు?
యూనివర్సిటీ కాలేజ్ లండన్, స్టాన్‌ఫోర్డ్ మెడిసిన్, పిట్స్‌బర్గ్ యూనివర్సిటీ పరిశోధకులు కలిసి అభివృద్ధి చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: