ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్, పర్ ప్లెక్సిటీ ఏఐ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ వంటి టెక్ దిగ్గజాలకు తాను ఇచ్చిన మొదటి సలహాను వెల్లడించారు.
Read Also: Naveen Polishetty: ‘అనగనగా ఒక రాజు’ సినిమా నుంచి ‘భీమవరం బల్మా’ పాట విడుదల
ఏఆర్ రెహమాన్ కీలక సలహా
“ప్రజలు ఉద్యోగాలు కోల్పోయేలా చేయొద్దు” అని వారికి సూచించినట్టు తెలిపారు. జెరోధా సహ-వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్‌లో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు.ఏఐ టెక్నాలజీని ఒక ‘బజూకా’తో పోల్చిన రెహమాన్, దాని వాడకంపై కచ్చితమైన నియంత్రణ ఉండాలని అభిప్రాయపడ్డారు. “బజూకాను కొన్నప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి కదా? అది ప్రమాదకరం కాబట్టి అందరికీ ఇవ్వరు. ఏఐ కూడా అలాంటిదే.
నియంత్రణ లేకపోతే ఇది ప్రజల ఉద్యోగాలను లాగేసుకుని, కుటుంబాలను పేదరికంలోకి నెట్టేస్తుంది. అందుకే ట్రాఫిక్, ఇమ్మిగ్రేషన్ నియమాల్లాగే ఏఐకి కూడా మానవులు నియమాలు రూపొందించాలి” అని ఆయన స్పష్టం చేశారు.అయితే, ఏఐ (AI) ని తాను ఒక ‘సమానత్వకర్త’గా కూడా చూస్తున్నానని రెహమాన్ తెలిపారు.
సంగీతకారులకు నష్టం
వనరులు లేని యువ కళాకారులకు, కలలు కనేవారికి ఏఐ అండగా నిలుస్తుందని, కానీ అదే సమయంలో నియంత్రణ లేకపోతే ప్రస్తుతం పనిచేస్తున్న సంగీతకారులకు నష్టం చేస్తుందని హెచ్చరించారు. పేదరికం, తప్పుడు సమాచారం వంటి తరతరాల సమస్యలను పరిష్కరించేందుకు ఏఐని శక్తివంతంగా మార్చాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: