AP Crime Investigation: నేరస్తుల చిట్టా ఇక అరచేతిలో

Follow Us: Google News Daily Hunt
The List of Criminals — Now in the Palm of Your Hand
The List of Criminals — Now in the Palm of Your Hand
FONT SIZE
GET APP

అందుబాటులోకి ‘పాపిల్లాన్ ఫింగర్ ప్రింట్ స్కానర్’ సాంకేతికత

AP Crime Investigation: ఎపిలో నేరాలను నియంత్రించి, పాత నేరస్థులకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ సాంకేతికతను అందిపుచ్చుకుంది. ఇందులో భాగంగా తాజాగా ‘పాపిల్లాన్ ఫింగర్ ప్రింట్ స్కానర్’ అనే అత్యాధునిక పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పరికరం సాయంతో అనుమానితుల నేర చరిత్రను కేవలం సెకన్ల వ్యవధిలోనే తెలుసుకోవచ్చు. నేర నియంత్రణలో ఇది ఒక కీలక అస్త్రంగా మారనుందని పోలీస్ శాఖ భావిస్తోంది.

Read also: Minister Ramprasad Reddy: ఏపీ రోడ్డు భద్రత కోసం ఆధునిక కంట్రోల్ రూమ్

The List of Criminals — Now in the Palm of Your Hand

The List of Criminals — Now in the Palm of Your Hand

ఈ స్కానర్ చాలా చిన్నదిగా, తేలికగా ఉండటంతో పోలీసులు విధుల్లో ఉన్నప్పుడు సులభంగా తమతో పాటు తీసుకెళ్లవచ్చు. దీనిని మొబైల్లోని ప్రత్యేక యాప్తో అనుసంధానిస్తారు. అనుమానిత వ్యక్తి బొటన వేలు లేదా చూపుడు వేలి ముద్రను స్కానర్పై ఉంచిన వెంటనే, ఆ వివరాలు పోలీస్ శాఖ వద్ద ఉన్న డేటాబేస్లో సరిపోల్చుకుంటాయి. ఒకవేళ ఆ వ్యక్తిపై రాష్ట్రంలోని ఏ పోలీస్ స్టేషన్ లోనైనా కేసులు నమోదై ఉన్నా, రౌడీ షీట్ తెరిచి ఉన్నా.. ఆ వివరాలన్నీ క్షణాల్లో స్క్రీన్పై కనిపిస్తాయి. ఏ కేసు, ఎక్కడ నమోదైంది వంటి పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుంది. ఒకవేళ ఎలాంటి నేర చరిత్ర లేకపోతే నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది.

AP Crime Investigation: అరచేతిలోనే నేరగాళ్ల పూర్తి వివరాలు

ముఖ్యంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి రద్దీ ప్రదేశాల్లో పాత నేరస్థులు, దొంగలు ప్రయాణికులతో కలిసిపోయి నేరాలకు పాల్పడుతుంటారు. వారిని గుర్తించడం పోలీసులకు సవాలుగా ఉండేది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని, ఇతర పోలీస్ స్టేషన్ల పరిధిలోని నేరస్థులను పట్టుకోవడం కష్టమయ్యేది. ముఖ్యంగా రాత్రి వేళల్లో గస్తీ కాస్తున్న సిబ్బందికి అనుమానితులను విచారించినా, వారిపై కేసులు ఉన్నాయో? లేదో? తెలుసుకోవడానికి సమయం పట్టేది. ఈ సమస్యలకు పరిష్కారంగా ఈ కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టారు.

రద్దీ ప్రదేశాల్లో నిఘా మరింత సులభం

ఈ పాపిల్లాన్ స్కానర్ రాకతో పోలీసులపనితీరు మరింత సులభతరం కానుంది. నేరస్థుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, అనుమానితుల వివరాలను వెంటనే ధృవీకరించుకోవడం ద్వారా నేరాలు జరగకముందే నివారించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా నేరాల నియంత్రణలో ఈ పరికరం ఒక కీలక సాధనంగా ఉపయోగపడనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు