సూళ్లూరుపేట: ఎల్విఎం3-ఎం6 భారీ విజయం తర్వాత మరో గఘన విజయానికి ఇస్రో సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి పిఎస్ఎల్వి-సి62 రాకెట్ ద్వారా ఎస్ఎల్వి-సి62 రాకెట్ ద్వారా జనవరి 12న ఉదయం 10 గంటల 17 నిముషాలకు అన్వేష్(Anvesh Satellite) (ఇఓఎస్-ఎన్1) ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నది. దీనితో పాటు మరో 15 వాణిజ్య ఉపగ్రహాలను కూడా రోదశిలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి ఆదివారం ఉదయం 10 గంటల 17 నిము షాలకు కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. 24 గంటల పాటు ఈ కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగి సోమవారం పిఎస్ఎల్వి-సి62 రాకెట్ నింగిలోకి ఎగురుతుంది.
Read also: IT Campus:విశాఖలో ఇన్ఫోసిస్ పర్మనెంట్ క్యాంపస్‌కు అడుగులు
శ్రీహరికోట లోని ఇంటిగ్రేషన్ ఫెసిలిటి భవనం (పిఐఎఫ్) లో రాకెట్ అనుసంధాన కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ ప్రయోగంలో 1,485 కేజీల బరువు ఉన్న అన్వేష్ ఉపగ్రహాన్ని ప్రయోగి స్తున్నారు. ఇది అత్యంత కీలకమైన ఉపగ్రహం. ఇప్పటి వరకు భారత రక్షణ వ్యవస్థకు మూడోనేత్రంలా పనిచేసే భూపరిశీలన ఉపగ్రహాలను అనేకం ఇస్రో అంతరిక్షంలోకి వంపి ఉంది. భూపరిశీలన చేసిన తర్వాత సమాచా రాన్ని భూమికి చేరవేసే ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని ఈ ఉపగ్రహానికి అన్వేష్ అనే నామకరణం చేశారు.
ఈ ఉపగ్రహం సైనిక అవసరాల నిఘా నిమిత్తం భూమికి, 600 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తూ సమాచారాన్ని భూతలంలోని కంట్రోల్ సెంటర్కు చేరవేస్తుంది. ఈ ప్రయోగంలో స్పానిష్కు చెందిన స్టార్టప్ ఆర్బిటల్ పారడైజ్(Anvesh Satellite) భాగస్వామ్యంతో నిర్మించిన 25 కేజీల బరువు గల క్రిస్టల్ ఇనిషియల్ డెమానుస్ట్రేటర్ (కెఐడి) క్యాప్సూ లను ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. ప్రయోగా త్మకంగా ప్రయోగించిన క్యాప్సూల్ను తిరిగి భూవాతా. వరణంలోకి ప్రవేశించడం కోసం దక్షిణ పసిఫిక్ మహాస ముద్రంలో ఓ స్మాష్ డౌన్ జోన్ను గుర్తించారు. పిఎస్ ఎల్వీ ప్రయోగాల్లో ఇది 64వది. ఇస్రో ప్రయోగిస్తున్న 104వ ఉపగ్రహ ప్రయోగం ఇది. చంద్రయాన్-1, మార్క్ ఆర్బిటల్ మిషన్, ఆదిత్య ఎల్1, ఆస్ట్రోశాట్ మిషన్ అనే ముఖ్యమైన ప్రయోగాల్లో ఉపగ్రహాలను గమ్యస్థానానికి చేర్చడంలో పిఎస్ఎల్వి రాకెట్ తన సత్తా చాటింది. 2017 సంవత్సరంలో ఒకేసారి 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టి ఇస్రో రికార్డు సృష్టిం చింది. ప్రస్తుతం ఈ ప్రయోగంపై షార్ శాస్త్రవేత్తల్లో ఉత్కంఠ నెలకొని ఉంది. పిఎస్ఎల్వి-సి61 మూడో దశలో ప్రయోగం ఆశించినంత విజయవంతం కాలేదు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: