📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

Harsh Goenka: ఏఐ ఉద్యోగాలను పెంచుతుంది.. ఏ విదంగానో చెప్పిన హర్ష్ గోయెంకా

Author Icon By Anusha
Updated: August 6, 2025 • 4:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI) ఈ కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో ఒకటి. ఈ టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు కోల్పోతామనే భయం అనేక మందికి భయం పట్టేసింది. రోబోట్స్, ఆటోమేషన్, AI ఆధారిత సాఫ్ట్‌వేర్‌లు మనుషుల స్థానంలో పనులు చేస్తాయన్న భయం ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులలో ఆందోళన కనిపిస్తోంది. అయితే ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్‌పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా (Harsh Goenka) ఈ ఆందోళనలను కొంతవరకు తగ్గించేలా ఒక భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. AI మనుషుల ఉద్యోగాలను తీసివేయడం కాకుండా వాటిని మరింత మెరుగుపరుస్తుందని, సరికొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఉద్యోగాలు వెలువడతాయని

హర్ష్ గోయెంకా తన ఎక్స్ (పూర్వ ట్విట్టర్) అకౌంట్‌లో ఒక పోస్ట్ చేస్తూ ప్రస్తుతం ఎక్కువ మంది యువత ఏఐ కారణంగా ఉద్యోగాలు పోతాయేమోనన్న భయంతో ఉన్నారని గుర్తు చేశారు. కానీ వాస్తవానికి AI కారణంగా పనుల తీరు మారిపోతుందని, పాత పద్ధతులు చెరిపివేయబడి కొత్త అవకాశాలు ఏర్పడతాయని అన్నారు. భవిష్యత్తులో AI కారణంగా మూడు ప్రధానమైన కొత్త ఉద్యోగాలు వెలువడతాయని ఆయన స్పష్టం చేశారు.ఆయన పేర్కొన్న మొదటి ఉద్యోగం ప్రాంప్ట్ ఇంజనీర్. ఏఐ టూల్స్‌కి సరైన సూచనలు, ఆదేశాలు ఇచ్చి, గరిష్ట ఫలితాలు వచ్చేలా చేయడంలో ఈ ఉద్యోగం కీలకమవుతుంది. రెండోది AI ప్రొడక్ట్ మేనేజర్. ఈ ఉద్యోగం ద్వారా AI ఆధారిత ఉత్పత్తులు, సాఫ్ట్‌వేర్‌లు మార్కెట్లోకి రావడానికి అవసరమైన ప్రణాళికలు, అభివృద్ధి ప్రక్రియలను పర్యవేక్షిస్తారు.

స్మార్ట్ వర్క్

మూడోది AI ఎథిక్స్ స్పెషలిస్ట్. ఈ ఉద్యోగం ద్వారా కృత్రిమ మేధస్సు అభివృద్ధి, వినియోగంలో నైతిక విలువలు, సామాజిక ప్రభావాలను పరిగణనలోకి తీసుకుంటూ మార్గదర్శకాలు రూపొందిస్తారు.అలాగే కార్యాలయాలు నేటిలా కాకుండా వాటి రూపురేఖలే పూర్తిగా మారిపోయే అవకాశం ఉందన్నారు. స్మార్ట్ వర్క్ చేసేవారు వీటిలో బాగా రాణిస్తారని.. అభిప్రాయం వ్యక్తం చేశారు.ప్రస్తుతం గోయెంకా చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో.. అనేక మంది స్పందిస్తున్నారు. తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. చాలా మంది నెటిజన్లు ఏఐ భవిష్యత్తుపై ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక నెటిజన్ “ఏఐ ఉద్యోగాలను తగ్గిస్తుందని భయపడటం సరికాదు, అది కొత్త మార్గాలను తెరుస్తుంది” అని పేర్కొన్నారు.

వ్యక్తిగత అవసరాలకు

మరొకరు ఏఐ వల్ల అన్ని రంగాల్లో ఉత్పాదకత పెరుగుతుందని, తద్వారా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెంది కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని అభిప్రాయపడ్డారు.వెంఛర్ క్యాపిటలిస్ట్ వినోద్ ఖోస్లా లాంటి ప్రముఖులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏఐ ట్యూటర్ల రాకతో సాంప్రదాయ కాలేజ్ డిగ్రీలకు ప్రాముఖ్యత తగ్గుతుందని.. వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా విద్య లభిస్తుందని ఆయన అంచనా వేశారు. మొత్తానికి భవిష్యత్ పని ప్రపంచంలో విజయం సాధించాలంటే AIకి అనుగుణంగా మారడం మరియు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం అత్యంత అవసరం అని ఈ అభిప్రాయాలు స్పష్టం చేస్తున్నాయి.

AI ప్రధాన లక్ష్యం ఏమిటి?

మనుషుల మాదిరిగా తెలివైన ప్రవర్తనను యంత్రాలలో అభివృద్ధి చేయడం, సమస్యలు పరిష్కరించడం, పనులను ఆటోమేట్ చేయడం AI ప్రధాన లక్ష్యం.

AIని ఎక్కడ ఉపయోగిస్తున్నారు?

ఆరోగ్యం, ఆటోమొబైల్స్ (సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు), ఫైనాన్స్, రోబోటిక్స్, గేమింగ్, సోషల్ మీడియా, కస్టమర్ సపోర్ట్ వంటి అనేక రంగాలలో AIని ఉపయోగిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/ind-vs-eng-pakistani-cricketer-makes-false-allegations-against-indian-team/international/526924/

AI product manager opportunities Artificial Intelligence employment impact Breaking News Harsh Goenka AI future jobs latest news new AI careers prompt engineer job role Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.