టెక్ ప్రపంచంలో వేగంగా మారుతున్న పరిణామాలపై SAP CEO క్రిస్టియన్ క్లేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కీబోర్డుల వినియోగం క్రమంగా తగ్గిపోయి, పూర్తిగా కనుమరుగయ్యే అవకాశమూ ఉందని ఆయన స్పష్టం చేశారు. రాబోయే మూడేళ్లలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI), లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కారణంగా వాయిస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ అద్భుతమైన స్థాయికి చేరుకుంటుందని,
Read Also: Online: 2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?
మాన్యువల్ పనులపై ఆధారపడే వారికి హెచ్చరిక
ఇకపై డేటా ఎంట్రీ కోసం గంటల తరబడి టైప్ చేయాల్సిన అవసరం ఉండదని ఆయన పేర్కొన్నారు. 1714లో మొదలైన కీబోర్డ్ ప్రయాణం స్థానాన్ని (AI)భర్తీ చేయబోతోందని, ఇది కేవలం సౌకర్యమే కాకుండా మాన్యువల్ పనులపై ఆధారపడే వారికి హెచ్చరిక అని, టెకీలు AI సాంకేతికతకు అనుగుణంగా తమను తాము అప్‌గ్రేడ్ చేసుకోవడం అత్యవసరమని ఆయన సూచించారు.
కీబోర్డ్‌ను ఎవరు కనిపెట్టారు?
కీబోర్డ్‌కు ప్రాతిపదిక అయిన QWERTY లేఅవుట్‌ను క్రిస్టోఫర్ లాథమ్ షోల్స్ (Christopher Latham Sholes) 1868లో కనిపెట్టారు. మొదట ఇది టైప్‌రైటర్ కోసం రూపొందించబడింది.
మొదటి కీబోర్డ్ ఎప్పుడు ఉపయోగంలోకి వచ్చింది?
19వ శతాబ్దం చివర్లో, టైప్‌రైటర్‌లతో పాటు మొదటి కీబోర్డ్ ఉపయోగంలోకి వచ్చింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: