📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐఫోన్ 18 ప్రో వివరాలు లీక్ మెట్రోకు స్కైవాక్‌లు ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం ఐఫోన్ 18 ప్రో వివరాలు లీక్ మెట్రోకు స్కైవాక్‌లు ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం

Aadhaar Update:కొత్త ఆధార్ యాప్ జనవరి 28న లాంచ్

Author Icon By Pooja
Updated: January 27, 2026 • 3:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆధార్ కార్డు(Aadhaar Update) యూజర్లకు యూఐడీఏఐ ఓ మంచి వార్తను ప్రకటించింది. ఈ నెల 28న యూఐడీఏఐ కొత్త ఆధార్ యాప్‌ను పూర్తి స్థాయిలో లాంచ్ చేయబోతుంది. ఈ యాప్ ద్వారా ఆధార్ వివరాలను ఎక్కడినుంచైనా, ఎప్పుడైనా సులభంగా అప్డేట్ చేయవచ్చు.

Read Also: Maldives: మోదీ ట్వీట్‌ను తప్పుగా అనువదించిన ‘గ్రోక్’

ఆన్‌లైన్ అప్డేట్‌తో సదుపాయాలు పెరుగుతున్నాయి

ఇప్పటికే ఆధార్ సేవలను మరింత సులభతరం చేయడానికి యూఐడీఏఐ నూతన సదుపాయాలను ప్రవేశపెట్టుతూ వస్తోంది. ఆధార్ డేటాను అప్‌డేట్ చేయాలంటే మునుపటి విధంగా ఆధార్ సెంటర్‌కి వెళ్లాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు మొబైల్ ద్వారా ఆన్‌లైన్ ద్వారా వివరాలు సవరించుకోవచ్చు.

కొత్త యాప్‌లో ముఖ్యంగా మొబైల్ నెంబర్ అప్డేట్(Aadhaar Update) ఫీచర్‌ను జోడించారు. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఎక్కడ ఉన్నా తమ ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ నెంబర్‌ను మార్చుకోవచ్చు. ఇది జనవరి 28న లాంచ్ కానున్న పూర్తి స్థాయి యాప్‌లో అందుబాటులో ఉంటుంది.

ఎందుకంటే మొబైల్ నెంబర్ అప్డేట్ అవసరం?

ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఇప్పటికీ చాలా కీలకమైనది. ప్రభుత్వ పథకాల లాభాలు పొందాలంటే, బ్యాంక్ KYC కోసం OTP అవసరమైనప్పుడు ఆధార్‌లో నమోదైన నెంబర్‌కు మాత్రమే OTP వస్తుంది. కానీ కొంత మంది వారి మొబైల్ నెంబర్‌ను తరచుగా మార్చుకుంటారు. అలాంటి సందర్భాల్లో నెంబర్ అప్డేట్ చేయకపోతే OTP రాకపోవడం వల్ల సేవలు పొందలేరు.

మొబైల్ నెంబర్ ఎలా మార్చుకోవాలి?

  1. Google Play Store‌లో “Aadhaar” అని సెర్చ్ చేయండి
  2. ఆధార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
  3. మీ మొబైల్ నెంబర్‌తో లాగిన్ అవండి
  4. Mobile Number Update ఆప్షన్ ఎంచుకోండి
  5. కొత్త మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, డోబ్ వివరాలు నమోదు చేసి OTP ద్వారా ధృవీకరించండి
  6. కొన్ని రోజుల్లో మీ ఆధార్‌లో నెంబర్ అప్డేట్ అవుతుంది
  7. Update Status లోకి వెళ్లి స్థితిని తనిఖీ చేయొచ్చు

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu MobileNumberUpdate UIDAI

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.