हिन्दी | Epaper
గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త

నయా ఫోన్ రిలీజ్ చేసేందుకు మోటోరోలా సన్నాహాలు..

Divya Vani M
నయా ఫోన్ రిలీజ్ చేసేందుకు మోటోరోలా సన్నాహాలు..

భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం రోజు రోజుకీ పెరుగుతోంది.ప్రత్యేకంగా మధ్య తరగతి ప్రజల కోసం బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్‌లోకి రావడం సాధారణమైంది. ఈ కోవలో, ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా తన తాజా స్మార్ట్‌ఫోన్ మోటో జీ 05 విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 7న ఈ ఫోన్ భారతదేశంలో అధికారికంగా లాంచ్ అవుతుందని సంస్థ ప్రకటించింది.మోటో జీ 05 పేరుకే బడ్జెట్ ఫోన్. కానీ దీని ఫీచర్లు వింటే ఇది ఖరీదైన ఫోన్లకు ధీటుగా ఉంటుంది.90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్,1,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్న పెద్ద 6.67 అంగుళాల డిస్‌ప్లే, ప్రీమియం లెదర్ ఫినిషింగ్ లాంటి ఫీచర్లు దీనికి ప్రత్యేక ఆకర్షణ.ఈ ఫోన్ ముఖ్యంగా మి రెడ్‌మీ సీ మరియు ఏ సిరీస్ ఫోన్లకు గట్టి పోటీ గా నిలవనుంది.

నయా ఫోన్ రిలీజ్ చేసేందుకు మోటోరోలా సన్నాహాలు
నయా ఫోన్ రిలీజ్ చేసేందుకు మోటోరోలా సన్నాహాలు

ఫ్లిప్‌కార్ట్ సమాచారం ప్రకారం మోటో జీ 05లో వివిధ ఆకర్షణీయ ఫీచర్లు ఉన్నాయి డిస్‌ప్లే 6.67 అంగుళాల FHD+ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో.డిజైన్ వెగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్, ముఖ్యంగా రెడ్ కలర్‌లో అందుబాటులో.ప్రాసెసర్ మీడియాటెక్ హీలియో జీ 81 ఎక్స్‌ట్రీమ్ చిప్‌సెట్.బ్యాటరీ 5,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. కెమెరా 50 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా.ఆడియో డాల్బీ అట్మాస్, హై-రెజల్యూషన్ ఆడియో మద్దతు.

మోటో జీ 05ని ప్రత్యేకంగా డిస్‌ప్లే,కెమెరా,మరియు బ్యాటరీ లాంటి అంశాల్లో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఐపీ 52 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ వంటి ఖరీదైన ఫీచర్లు కూడా ఈ ఫోన్లో ఉన్నాయి.మోటో జీ 04ను రూ. 6,999 ధరలో విడుదల చేసిన మోటోరోలా, ఇప్పుడు మోటో జీ 05ను రూ.10,000 లోపు ధరలో అందించే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కేటగిరీలో మరింత గట్టిపోటీని తెస్తుందని తెలుస్తోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870