Supriya Sule impatience with Air India

Supriya Sule: విమానయాన సంస్థలకు కఠినమైన నిబంధనలు విధించాలి: సుప్రియా సూలే

Supriya Sule: ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఎయిర్‌ ఇండియా విమానంపై అసహనం వ్యక్తంచేశారు. తాను ప్రయాణించాల్సిన విమానం కోసం గంటకు పైగా వేచి చూడాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా విమానయాన సంస్థలు జవాబుదారీతనంతో వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖను కోరారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఎయిర్ ఇండియా విమానాలు నిరంతరం ఆలస్యం అవుతున్నాయి. మేము ప్రీమియం ఛార్జీలు చెల్లిస్తాం. అయినప్పటికీ విమానాలు సమయానికి చేరుకోవు. దీని కారణంగా పిల్లలు, వృద్ధులతో సహా అనేకమంది ఇబ్బందులు పడుతున్నారు.

విమానయాన సంస్థలకు కఠినమైన నిబంధనలు

ఇలాంటి ఆలస్యాలు ఆమోదయోగ్యం కావు

నేను ఎయిర్ఇండియా సంస్థకు చెందిన విమానంలో ప్రయాణించా. దీనికోసం గంట 19 నిమిషాలు వేచి చూడాల్సి వచ్చింది. ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసే ఇలాంటి ఆలస్యాలు ఆమోదయోగ్యం కావు. విమానయాన సంస్థలకు కఠినమైన నిబంధనలు విధించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ని ఈసందర్భంగా కోరుతున్నా. ఇలాంటి జాప్యాలు పునరావృతం కాకుండా ఆయా సంస్థలు బాధ్యతగా వ్యవహరించాలి. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలి అని ఆమె రాసుకొచ్చారు.

తగు జాగ్రత్తలు తీసుకుంటామని

మరోవైపు ఈ పోస్టు పై ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది. తమ చేతుల్లో లేని పలు సమస్యల వల్ల విమానాలు ఆలస్యం అవుతున్నాయని తెలిపింది. మీరు ప్రయాణించే విమానానికి అలాంటి సమస్యే ఎదురైనట్లు వెల్లడించింది. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని ఎక్స్ వేదికగా పేర్కొంది.

Related Posts
రేవ్ పార్టీ కేసులో బిగ్ ట్విస్ట్.. కోర్టుకెక్కిన రాజ్ పాకాల
raj paakala

జన్వాడ రేవ్ పార్టీ కేసు కీలక మలుపు తిరిగింది. తనని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయాలని ప్రయత్నిస్తున్నారని, తనని అరెస్ట్ చేయకుండా పోలీసులను ఆదేశించాలంటూ హైకోర్టులో లంచ్ Read more

జాతీయ పత్రికా దినోత్సవం: ప్రజాస్వామ్య విలువలను కాపాడే పత్రికలు
national press day 1

ప్రతి సంవత్సరం నవంబర్ 16న జరుపుకునే జాతీయ పత్రికా దినోత్సవం, భారత పత్రికా మండలి (PCI) స్థాపనను గుర్తించేందుకు ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంది. 1966లో స్థాపించిన Read more

Cabinet : తెలంగాణ క్యాబినెట్‌లోకి నలుగురు కొత్త మంత్రులు!
Four new ministers inducted into Telangana cabinet!

Cabinet : సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ మంత్రివర్గ విస్తరణపై చర్చ తెరపైకి వస్తుంది. తాజాగా సోమవారం సాయంత్రం సీఎం రేవంత్, డిప్యూటీ Read more

IPL: త్వరలో ఐపీఎల్ 2025 సీసన్ ప్రారంభం
IPL: త్వరలో ఐపీఎల్ 2025 సీసన్ ప్రారంభం

ఐపీఎల్ 2025: సిక్సర్ల వర్షం కురిపించిన జట్లు - టాప్ జాబితా మరో మూడు రోజుల్లో ఐపీఎల్ 2025 ఆరంభం భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *