తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హెచ్ సియు (HCU) అడవులను ధ్వంసం చేయడంపై కోట్టు మొట్టుకాయవేసింది. వారాంతం సమయంలో, రాత్రికి రాత్రి 30-40 బుల్డోజర్లను పెట్టి అడవుల్లోని చెట్లను
నరికించాల్సిన అవసరం ఎందుకొచ్చింది అని ఉన్నత ధర్మాసనం ప్రశ్నించింది.
అంతేకాదు అభివృద్ధి పేరుతో అడవులను నరకడం సమంజం కాదని హితవు పలికింది.

మీ అధికారులను జైలుకు పంపుతాం
అడవులను సంరక్షించాల్సి (Forests protected)బాధ్యత ప్రభుత్వానిదే అని సుప్రీంకోర్టు పేర్కొంది. అడవులను సంరక్షించాలా? లేదా మీ అధికారులను జైలుకు పంపాలా? అనే దానిపై మీరే నిర్ణయం తీసుకోండి అని కోర్టు హెచ్చరించింది. అడవుల్లో చెట్లను నరికించి, అది సుస్థిర అభివృద్ధి
కోసమేనని చెప్పి సమర్థించుకోలేరని రేవంత్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు (Supreme Court) చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ మండిపడ్డారు. తదుపరి విచారణ ఆగస్టు 13కు కోర్టు వాయిదా వేసింది .
Read hindi news: hindi.vaartha.com