हिन्दी | Epaper
వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు

World’s Longest Hair : ఈ గ్రామంలో మహిళలందరికీ పొడవైన జుట్టు

venkatesh
World’s Longest Hair : ఈ గ్రామంలో మహిళలందరికీ పొడవైన జుట్టు

World’s Longest Hair : నల్లగా ఉండే పొడవాటి జుట్టు మహిళల అందాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఈ కారణంగానే చాలా మంది అమ్మాయిలు పొడవాటి, ముదురు, మందపాటి జుట్టు కలిగి ఉండాలని కోరుకుంటారు. మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టినప్పుడు కూడా పొడవాటి జుట్టుకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. పొడవాటి జుట్టు కోసం అమ్మాయిలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తారు. అయితే చైనాలోని ఒక గ్రామంలో మహిళలు అటువంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. వారికి సహజంగానే నల్లగా తాచుపాములా జాలువారే జుట్టు ఉంటుంది.

చైనా మహిళలు పొడవాటి జుట్టుకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధులు. అంతేకాక, వారి జుట్టు సిల్కీగా, మెత్తగా ఉండటం కూడా ప్రత్యేకత. చైనాలోని పురాతన గ్రామమైన హువాంగ్‌లూ (Huangluo) లోని మహిళల జుట్టు గురించి తెలుసుకుంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ గ్రామం జిన్నా నది ఒడ్డున ఉంది. ఇక్కడ రెడ్ యావో (Red Yao) అనే తెగకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. ఈ మహిళలు పొడవాటి, మందపాటి, నల్లని జుట్టుకు ప్రసిద్ధి చెందారు.

ఈ గ్రామంలోని మహిళల జుట్టు పొడవు సాధారణంగా ఒకటిన్నర నుండి రెండు మీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ గ్రామాన్ని “లాంగ్ హెయిర్ విలేజ్” అని పిలుస్తారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఈ గ్రామం పేరు “పొడవాటి జుట్టు కలిగిన గ్రామం”గా నమోదు అయింది. ఇక్కడి ప్రజల నమ్మకం ప్రకారం, ఒక మహిళ జుట్టు పొడవుగా ఉండటం ఆమె కుటుంబానికి అదృష్టం తేవడాన్ని సూచిస్తుంది. ఇక్కడి మహిళలు తమ జీవితంలో ఒక్కసారే జుట్టును కత్తిరిస్తారు.

ఈ గ్రామంలోని అమ్మాయిలు తమ 18వ పుట్టినరోజున “హ్యారి కట్” చేయించుకుంటారు. అంటే, ఒక అమ్మాయి జుట్టును హ్యారీ కట్ చేయించుకుంటే, ఆమె వివాహానికి సిద్ధమైందని అర్థం. భాగస్వామిని వెతికే సమయంలో అమ్మాయిలు తమ జుట్టును పూర్తిగా కప్పి ఉంచుతారు. వారు కత్తిరించిన జుట్టును వారి అమ్మమ్మ దొరికించుకుంటారు. ఆ జుట్టును అమ్మాయి తన భర్తకు పెళ్లి తరువాత బహుమతిగా ఇస్తుంది. పెళ్లి కంటే ముందు మాత్రమే వారు తమ జుట్టును కాబోయే భర్తకు చూపిస్తారు.

ప్రతీ సంవత్సరం మార్చి 3వ తేదీన ఈ గ్రామంలో పొడవాటి జుట్టుల పండుగను నిర్వహిస్తారు. ఈ పండుగలో మహిళలు పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ తమ జుట్టును ప్రదర్శిస్తారు. ఈ ఉత్సవాన్ని వీక్షించేందుకు విదేశాల నుండి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చి ఉత్సాహంగా పాల్గొంటారు.

ఇక్కడి మహిళల పొడవాటి జుట్టు రహస్యం బియ్యం నీటిలో దాగి ఉంది. వారు పండించే ఒక ప్రత్యేక రకం బియ్యంతో తలస్నానం చేస్తారు. షాంపూలను వారు ఉపయోగించరు. అదివరకు, వారు స్థానిక నదిలోని నీటినే ఉపయోగించి తల కడుగుతారు.

ప్రపంచంలో అత్యంత పొడవైన చేతి గోర్లు కలిగిన మహిళ కూడా ఒక ఆసక్తికరమైన విషయం. ప్రతి ఒక్కరికి భిన్నమైన అభిరుచులు ఉంటాయి. అందులో చాలామంది మహిళలు ప్రత్యేకంగా గుర్తింపు పొందాలని కోరుకుంటారు. అందులో ఒక అభిరుచి చేతి గోర్లను పొడవుగా పెంచడమై ఉంటుంది. అమ్మాయిలు చేతి గోళ్లకు నెయిల్ పాలిష్ వేసి మరింత అందంగా తయారుచేస్తారు. సాధారణంగా గోర్లు కొన్ని సెంటీమీటర్లకే పరిమితం అవుతాయి. కానీ ఒక మహిళ ఏకంగా 24 అడుగుల పొడవైన గోర్లను పెంచింది.

హ్యూస్టన్‌కు చెందిన అయన్నా విలియమ్స్ అనే మహిళ 2017లో ప్రపంచంలోనే అత్యంత పొడవైన చేతి గోర్లను కలిగి ఉన్న మహిళగా రికార్డులోకి ఎక్కింది. ఆమె గోర్ల పొడవు 24 అడుగులు. నెయిల్ పాలిష్ వేయడానికి ఆమెకు 20 గంటల సమయం పట్టేది. దానికి ఎనిమిది మంది సహాయం అందించేవారు. అయితే చర్మ సమస్యల కారణంగా ఆమె చివరికి తన గోర్లను కత్తిరించాల్సి వచ్చింది. టెక్సాస్‌లోని ఒక డెర్మటాలజీ సెంటర్‌లో ఆమె గోర్లను విద్యుత్ రోటరీ మిషన్ ఉపయోగించి కత్తిరించారు.

విలియమ్స్ తర్వాత, మరో మహిళ — గ్రిస్ దచెస్ — తన చేతి గోర్లను పెంచుతూ మరో రికార్డు నెలకొల్పింది. ఆమె ఎడమచేతి గోర్లు 10 అడుగుల 2 అంగుళాలు, కుడి చేతి గోర్లు 9 అడుగుల 7 అంగుళాల పొడవు కలిగి ఉన్నాయి. దచెస్ దాదాపు 18 సంవత్సరాలుగా గోర్లను పెంచుతున్నారట.

ఇక ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టు కలిగిన మహిళగా చైనాకు చెందిన జీ క్విపింగ్ గుర్తింపు పొందారు. ఆమె జుట్టు పొడవు 5.627 మీటర్లు, అంటే సుమారు 18.46 అడుగులు. 2004 మేలో ఈ రికార్డు గిన్నిస్‌లో నమోదు అయింది. ఆమె ప్రతి వారం తలస్నానం చేస్తారు. ఇందుకు నాలుగురి సహాయం అవసరం అవుతుంది. జుట్టు తడిగా ఉన్నప్పుడే కొలుస్తారు, ఎందుకంటే అప్పుడు వంపులు ఉండవు. స్పష్టంగా పొడవు కొలవడానికి జుట్టును నేలపై పరచి కొలుస్తారు.

ఇక భారత్ విషయానికి వస్తే, థానే (మహారాష్ట్ర) కు చెందిన ఆకాంక్ష యాదవ్ అనే యువతి లిమ్మా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో “లాంగెస్ట్ హెయిర్” కలిగిన వ్యక్తిగా నమోదు అయింది. ఆమె జుట్టు పొడవు దాదాపు 9 అడుగులు 10.5 అంగుళాలు. 2019 నుండి ఆమె జుట్టును జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తోంది.(World’s Longest Hair)

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870