Working Hours News: ఉద్యోగులు, కార్మికులకు సంబంధించి.. వారు రోజుకు ఎన్ని గంటల పాటు పని చేయాలన్న అంశం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. మొట్టమొదటిగా ఎల్ అండ్ టి ఛైర్మన్ ఎన్ఎన్ సుబ్రహ్మణ్యన్ తమ సంస్థ ఉద్యోగులతో నిర్వహించిన ఒక సమావేశంలో మాట్లాడుతూ వారానికి కనీసం 90 గంటల పాటు పనిచేయాలని అన్నారు. అంతే కాకుండా ఆదివారం కూడా తమ విధుల్లో పాల్గొనాలని ఆయన పేర్కొన్నారు. ఆదివారాలు ఇంట్లో కూర్చొని భార్యల ముఖాలు చూస్తూ గడపడం సరికాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
వారంలో 48 గంటల పనివేళలు మించకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఈ పనివేళలు 48 గంటలకు మించితే ఉద్యోగులకు అదనపు వేతనం చెల్లించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రైవేటు యాజమాన్యాలు తమ ఉద్యోగులతో ఎక్కువ సమయం పని చేయిస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వులు సిబ్బందికి కొంత ఇబ్బందికరంగా పరిణమించే పరిస్థితి ఏర్పడింది.
వాస్తవానికి మానసిక శాస్త్రవేత్తలు, నిపుణులు చెబుతున్న ప్రకారం ఒక మనిషి ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల అతను ఉత్పత్తి చేసే అంశాలు నాణ్యతను కోల్పోతాయని స్పష్టం చేస్తున్నారు.
దీనికి అనుగుణంగా ఇన్ఫోసిస్ సంస్థ ఫౌండర్ నారాయణమూర్తి కూడా పనివేళల అంశంలో సుబ్రహ్మణ్యన్కు అనుకూలంగా ప్రకటన చేశారు. అయితే ఆనంద్ మహీంద్ర మాత్రం వీరిద్దనీ తాను ఎంతో గౌరవిస్తానని చెబుతూనే పనివేళల సమయంలో గంటలతో పనిలేదని, వారు చేస్తున్న పనికి సంబంధించి నాణ్యమైన ఉత్పత్తి ఇస్తే సరిపోతుందని అన్నారు. అంటే వారానికి 90 గంటలు అవసరం లేదని. 48 గంటలు పని చేసినా సంతృప్తికరంగా పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తాజాగా వాణిజ్య సముదాయాల్లోను, దుకాణాల్లోను పని చేసే వారు రోజుకు పది గంటలు పనిచేయడానికి వీలుగా ఉత్తర్తులను జారీ చేసింది. అయితే ఒక నిబంధన విధిస్తూ
పని వేళలు విపరీతమైన అలసటను, అసంతృప్తిని కలిగిస్తే ఆ ప్రభావం అతను పనిచేసే పనితనంపై చూపిస్తుందని, దీనివల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరిగే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు.
అంతే కాకుండా కార్మికులు, ఉద్యోగులు అందరికీ ఒకే విధమైన పనివేళలు ఉండటం కూడా సరికాదని అన్నారు. ఉదాహరణకు శారీరక శ్రమను ఉపయోగించి పనిచేసే కార్మికులు ఎక్కువ సమయం పనిచేస్తే వారి ఆరోగ్య పరిస్థితి పైనే కాకుండా పనిచేసే సమయంలోనూ అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
మనిషి కుటుంబ జీవనానికి దూరం అయితే అతనిలో కొన్ని దుష్ఫలితాలు కనిపిస్తాయని,
ఒక పనిని మొదలు పెట్టిన మొదటి మూడు గంటలతో పోలిస్తే ఆ తరువాత క్రమంగా పనివేగం, నాణ్యత తగ్గుతుందని పేర్కొంటు న్నారు. ప్రతి నాలుగు గంటలకు ఒకసారి విశ్రాంతి కల్పించడం ద్వారా మరింత సమర్థవంతమైన పనిని వారి నుంచి సాధించవచ్చు. అదేవిధంగా కార్యాలయాల్లో మెదడును ఉపయోగించే పనిచేసే ఉద్యోగుల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు.
అందరికీ ఒకే పనిగంటలు సమానంగా ఉండకపోయినా ఆయా పనుల్లో మాత్రం అలసట ఎక్కువగా ఉంటే పనినాణ్యత తగ్గుతుందని మానసిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరోపక్క వారంలో రెండు రోజులు సెలవు ఉంటే వారు సేదతీరి తిరిగి విధుల్లో చేరే సమయంలో మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వారంలో ఒకరోజు పూర్తిగా విధులకు దూరంగా ఉండే విధంగా సిబ్బంది, కార్మికులు సేద తీరాలని, అప్పుడే వారి నుంచి పూర్తి స్థాయిలో పనిని చేయించుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు.
ఆ ప్రభావం పనిపై చూపించే ప్రమాదం ఉంటుందని వారు అంటున్నారు. అదే విధంగా సెలవు రోజుల్లో కొన్ని వ్యక్తిగత కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారని, ఉదా: వాహనం మరమత్తు, దుస్తులను శుభ్రం చేసుకోవడం, పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకోవడం లేదా ఆటవిడుపు కింద ఏదైనా ఆసక్తి ఉన్న ప్రదేశాలను సందర్శించడంగానీ, వినోదాల్లో పాల్గొనడం వంటి చర్యల ద్వారా తిరిగి పనికి వచ్చేసరికి ఉత్సాహంగా ఉంటారని పేర్కొంటున్నారు.
Working Hours News: యంత్రాలు సైతం నిరవధికంగా పనిచేస్తే దెబ్బతింటాయని, అదే విధంగా కార్మికులు, ఉద్యోగులు కూడా తగిన విశ్రాంతితోనే సమర్థవంతంగా పనిచేస్తారని స్పష్టం అవుతోంది. ఈ కారణాలు దృష్టిలో ఉంచుకుని గంటల పనివేళలు పక్కన పెట్టి నాణ్యత కలిగిన పనిని రాబట్టేందుకు సంస్థల యాజమాన్యాలు గాని, ప్రభుత్వాలు కాని వ్యవహరించాల్సిన ఆవసరం ఉంది.