చిగురు వెలుగు
కన్నీళ్ల తోట వేసినట్లుగా
పూటకో కాపు.
ఊడ్చి బస్తాలకెత్తిన సహనం
ఉప్పు నీటి కింద పడి ఊపిరి
పోకుండా చిత్తడి కళ్ల మధ్యలోనే
కాలం కొనకు మనిషిని ముడేసి
బతుకు పగుళ్లలో ఆశ చిగురు
వెలగాలని శూన్యంలోనూ మనసును
రెపరెపలాడిస్తూనే ఉంది.
లేచిగుళ్ళు .. లేత గరికలు
లేచిగుళ్ళు, లేత గరికలు
గంతులెయ్యడం మానేసాయా,
వర్షాలకి బదులు రక్తాలతో
నేలతల్లి తడిచిపోతుంటే!
పిట్టలూ పాటలూ పంటలూ
పడావు పడ్డాయా
మేఘాకాశాలకి బదులు
ఆయుధ పొగలు ఆకాశాన్ని
కమ్మేస్తుంటే గొడవలు మేలిమి
గుణాల కోసం పడాలి మలిన
రణాల కోసం కాకుండా మనుషుల
అసువుల అసలు సంగతి మతించాలి
గండ పుండు మోక్ష గతి మార్గానికి
విముక్తి దారిలో మసులుకోవాలి.
యుద్ధాలతో యోగులు కారు
యాగ బలాలతో యోగులవుతారు
మట్టి మనసు సుగంధ పరిమళాలు
వెదజల్లుతుంది ముష్టి యుద్ధాల
రుధిర దుర్వాసనలని భరించదు.
తెల్లారితే కళ్ళు విప్పే పూలు
మన కళ్ళు అవ్వాలి.. పూల
తేనెలుగా మన కన్నీళ్లు మారాలి
సతతం హరితాన్ని జీర్ణం చేసుకోవాలి.
Telugu Poetry: నాకై వెతుకులాట
అందరూ నన్ను గొప్పవాడివి అంటారు
కానీ నిజంగా నన్ను తెలుసుకునేది
నేను మాత్రమే. చిరునవ్వుల వెలుగులు
విరజిమ్ముతున్నా, నాలో ఎక్కడో
నీలిఛాయలు వెంటాడుతూనే ఉంటాయి.
ఒక్కోసారి గర్వంగా తల ఎత్తినా,
ఆ వెంటనే దిగులుతో వాలిపోతాను.
నాకే నచ్చిన నేను, అదే..
నాకై వెతుకుతున్న నేనూ.
ఎందుకో తెలియదు,
గెలిచినప్పుడే ఓటమిలా అనిపిస్తుంది.
నాకు నేను వేసే ప్రశ్నలకు
ఇతరుల జవాబులు కేవలం
మాటలే తప్ప.. సందేహం తీరదు.
ఒక రోజు.. నాలోని నన్ను నేనే ఓదార్చాలి,
నాలోనే ఉన్న నమ్మకాన్ని నేనే నమ్మాలి.
Telugu Poetry: కుసుమంలోనే దాక్కుని ఉంటాను
నీవు నీ గుండెపై అలంకరించుకుంటున్న
కుసుమంలోనే నేను తెంపి తెచ్చిన
ఆ కుసుమంలోనే నా అంతట
నేనే దాక్కుని ఉంటాను;
నీవు, అసలు అనుమానపడకుండా
నన్నే అలంకరించుకుంటూంటావు కూడా;
మిగిలినదంతా దేవతలకే తెలుసు!
నీ ఇంటి పూలకుండీలో ఉండి
వాడిపోతూన్న కుసుమంలోనూ
నా అంతట నేనే దాక్కుని ఉంటాను;
నీవు, నేనక్కడే ఉన్నానని
అసలు అనుమానపడకుండా దాదాపుగా
ఒంటరితనంలో నా కోసమై
నా. ఉనికిని తలచుకుంటూ ఉంటావు.
నాన్న పిలుపే ఓ బిరుదు
నాన్న అనే మాటకు విలువైన ఓ బిరుదే
నాన్న అనే పిలుపు పెదాలకు అందనిదే.
నాన్న అనే పిలుపు ధైర్యమే
నాన్న.. అనే పిలుపుకు సంతోషం
నాన్న అనే పిలుపుకు ఆనందమే
కూతుళ్ళతో కోడళ్ళలో
ఆ పిలుపే ఓ మధురమే
నాన్న పొద్దుననక పోయి రాతిరి
సంధ్యా సమయానికి తిరిగొస్తాడు.
నాన్న పిల్లల భవిష్యత్తు కోసం
ఆరా తీస్తాడు ఎందుకో నాన్న
తినకున్నా తిన్నానని చెప్తాడు.
ఎందుకో మరి..
నాన్న అబద్ధాలు చెప్తాడు
పిల్లల కోసం ప్రతిక్షణం
శ్రమతో శ్రమిస్తారు నాన్న
నాన్నకు పురస్కారాల కన్నా
పిల్లల క్షేమమే ఎక్కువ. బరువు,
బాధ్యతలంటే పిల్లలకు నేర్పిస్తాడు.
పిల్లల కోసం నాన్న చాలా వెనకబడ్డాడు.