📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Telugu Emotional Quotes: కవిత్వ జీవితం- నూతన స్వరం

Author Icon By Madhavi
Updated: July 17, 2025 • 12:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అన్నీ నీవే

నీ కనులలో కాంతి రేఖలు
నా బతుకు బాటకు వెలుగు
రేఖలు నీ నుదుటన
తూరుపు సింధూరం
నా భవితకు జీవన ఆధారం
నీ దరహాసపు చిన్ని పెదాలు
నా భావ కవితకు చిరు పదాలు
నీ మురిపాల సొట్ట బుగ్గలు
నా మదిలో చిగురించే మల్లెమొగ్గలు
నీ చుబుకాన పుట్టుమచ్చలు
నా గుండెపై పచ్చబొట్లు
నీ దానిమ్మ గింజలపళ్ళు
నన్ను ఖైదు చేసిన సంకెళ్లు

ఎండుటాకుల చప్పుడు

మాలగా అల్లబడిన మనుషులలోకి
ఒక పువ్వుగా చేరుకోలేను.
గుమ్మంలోకి అడుగు పెట్టాలంటే
విరిగిపడిన ఎండుటాకుల చప్పుడు
రంపాలుగా కోస్తుందేమోనని భయం.
గాలి చెట్లనే కాదు మనుషులను
కూడా కుదిపేస్తుంది. గుంపులో నుండి
వేరు చేసి నా నీడల కింద నన్నే
మరణించమంటుంది.

నలుగురితో
పాటు నా చేతులను కడుక్కోలేని
స్థితికి కారణాలు వెతుక్కోవాలి.
అవకాశాల విహంగాలను
కూల్చేసుకొని నుదుటిపై
మేకులను దించుకున్నాను.
ఇప్పుడు నేను చీమల
వరుస నుండి తప్పిపోయిన
అనాథను, పగిలిపోయిన మేఘాన్ని,
రాత్రిని వీపుపై మోస్తున్న గాయమైన
శరచ్చంద్రికని. పగిలిపోయిన అద్దాల్లో
మొన్నటి నిచ్చెన ముక్కలు ముక్కలుగా..
ఇప్పుడు సరిదిద్దాల్సింది అద్దాలను
కాదు ముక్కలైన నిచ్చెనను.
నీటిలోని ప్రతిబింబం కాలానికి
కొలమానం లాంటిదే. కొద్దిసేపటి
ముందు ప్రతిబింబం సంపూర్ణం
ఇప్పుడు పాక్షికం మరి రేపు?
అంతిమంగా; రేపటి ఉదయాన్ని
తొడుక్కోవాలి.

హరిత వర్ణం హరించుకుపోయిందా?

లేచిగుళ్ళు, లేత గరికలు గంతులెయ్యడం
మానేసాయా, వర్షాలకి బదులు రక్తాలతో
నేలతల్లి తడిచిపోతుంటే ! పిట్టలూ
పాటలూ పంటలూ పడావు పడ్డాయా
మేఘాకాశాలకి బదులు ఆయుధ
పొగలు ఆకాశాన్ని కమ్మేస్తుంటే !
గొడవలు మేలిమి గుణాల కోసం
పడాలి మలిన రణాల కోసం కాకుండా !
మనుషుల అసువుల అసలు సంగతి
మతించాలి గండ పుండు మోక్ష గతి
మార్గానికి విముక్తి దారిలో మసులుకోవాలి!
యుద్ధాలతో యోగులు కారు యాగ
బలాలతో యోగులవుతారు ! మట్టి మనసు
సుగంధ పరిమళాలు వెదజల్లుతుంది
ముష్టి యుద్ధాల రుధిర దుర్వాసనలని భరించదు!
తెల్లారితే కళ్ళు విప్పే పూలు మన కళ్ళు అవ్వాలి !
పూల తేనెలుగా మన కన్నీళ్లు మారాలి !
సతతం హరితాన్ని జీర్ణం చేసుకోవాలి !

కోయిలమ్మ స్వరంలో కొత్త రాగాలు

ఆకాశం నుండి రాలుతున్న తారలు
తెగిపోయిన వీణ తంత్రులు
అయినా కానీ రాతి గర్భం నుండి
మొలుస్తున్న అంకురాలు కోయిలమ్మ
స్వరంలో కొత్తరాగాలు కొత్త గీతం
పాడుతున్నాను కొత్త ఉషోదయం
తొలి వెలుగు రేఖలు పృథ్వి అంతా
పరుచుకున్న అరుణ రేఖలు
కొత్త గీతం పాడుతున్నాను.
కరిగిపోయిన కలల తాలుకు
నిట్టూర్పు ఎవరికి వినబడుతుంది.
మనసులో దుఃఖం కన్నీళ్ల రూపంలో
కళ్ల నుండి రావడానికి సిద్ధంగా ఉంది
ఓటమిని అంగీకరించను.
కాలం అనే కాగితంపై రాస్తున్నాను
చెరిపేస్తున్నాను కొత్త గీతం పాడుతున్నాను.

Read also: hindi.vaartha.com
Read also: Modern Telugu Poets : తెలుగు కవిత్వాలు

#EmotionalVerses #HopeAndDespair #ModernKavita #SpiritualJourney #TeluguPoetry

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.