📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Self Realization: మనసనే భూతం

Author Icon By Madhavi
Updated: July 12, 2025 • 1:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Self Realization: ఒకరోజు ఒకతను ఓ యోగిని వెతుక్కుంటూ వెళ్లాడు. చివరకు ఒక చోట యోగిన కలిశాడు. యోగికి నమస్కరించి “స్వామీ, నేను శారీరకంగా కష్టించి కష్టించి అలసిపోయాను. అయినప్పటికీ నేననుకున్న పనులేవీ పూర్తి కావడంలేదు.

ఎప్పుడు పూర్తవుతాయో తెలియడం లేదు. ఏదో ఒక పని మిగిలిపోతోంది. నేను చేయవలసిన పనులన్నీ పూర్తి కావాలి. వాటిని ముగించడానికి నాకు శక్తి కావాలి. దానికేమిటి మార్గం?” అని అడిగాడు అతను. “ఆ శక్తిని నేను నీకిస్తాను. అయితే అది నీకు ఇబ్బందికరంగానే తయారవుతుంది” అన్నాడు యోగి.

“అయినా పరవాలేదు స్వామీ, మీరిచ్చే శక్తితో నాకే ఇబ్బంది రాదు. వచ్చినా వాటిని ఎదుర్కోగలను. మీరు నాకు శక్తిని ప్రసాదించండి స్వామీ!” అన్నాడు ఆ మనిషి, యోగి అతను చెప్పినవన్నీ విన్నాక ఆలోచించాడు. “దగ్గరకు రా” అన్నాడు యోగి, ఆ మనిషి దగ్గరకు వెళ్ళాడు. అతని చెవిలో ఓ మంత్రాన్ని ఉపదేశించాడు యోగి, యోగి చెప్పినట్టు అతనింటికి వెళ్లి ఆ ఉపదేశాన్ని ఒకటికి పది సార్లు చెప్పడంతోనే ఓ భూతం అతని ముందు ప్రత్యక్షమైంది.

“అయ్యా, నేను మీరు ఏ పని చెప్తే ఆ పని చేయడానికి వచ్చాను. కానీ ఒక నిబంధన అనుకోండి లేదా షరతు అనుకోండి.. అది మీ ఇష్టం. మీరెలా అనుకున్నా పరవాలేదు. రోజంతా మీరు నాకు ఏదో ఒక పని చెప్తూనే ఉండాలి. నాకుగానీ మీరు పని చెప్పకుండా మౌనంగా ఉంటే నేను మిమ్మల్ని మింగేస్తాను” అన్నది ఆ భూతం, అతను ఆ భూతం వంక చూశాడు. మరో దారి లేదు. “సరేనని” భూతం షరతుకి ఒప్పుకున్నాడు. భూతం మహదానందంగా “అయితే వని చెప్పు” అంది.

“నాకో పెద్ద భవనం కావాలి” అన్నాడతను. క్షణాల్లో ఓ అందమైన పెద్ద భవనం ఏర్పాటు చేసేసింది భూతం. “నాకిప్పుడు ఓ పెద్ద తోట కావాలి” అన్నాడతను. తోటనూ ఏర్పాటు చేసింది భూతం “గుర్రం కావాలి” అన్నారు. వెంటనే గుఱ్ఱం వచ్చేసింది అక్కడికి. “ఇప్పుడు నాకు ఏనుగు కావాలి” అన్నారు. అంతే! అతను మాట పూర్తి చేసేలోపు ఏనుగు సిద్ధమైపోయింది.  అతను ఒక దాని తర్వాత ఒకటిగా పని చెప్తూనే ఉన్నాడు. కానీ అతను చెప్తున్న పనులన్నీ క్షణాల్లో జరిగిపోతున్నాయి. ఎక్కడా ఆలస్యం కాకుండా భూతం అతను చెప్పిన పనులను చేసి పెడుతోంది. అతనిక చెప్పడానికి ఏ పనీ లేదు. అతను ఆలోచనలో పడ్డాడు. ముందే చేసుకున్న ఒప్పందం మేరకు భూతం అతని దగ్గరకు వచ్చింది.

Self Realization: “నువ్వు ఏ పనీ చెప్పకపోవడంతో నిన్ను మింగేయడం తప్ప చేసేదేమీ లేదంది” భూతం. అతను ఉన్న చోటు నుంచి పరుగులు పెట్టాడు. తిన్నగా యోగి దగ్గరకు వెళ్ళి ఆయన కాళ్లపై పడ్డాడు. “స్వామీ, నన్ను కాపాడండి” అన్నాడు. అతను. యోగి అతని వంక చూశాడు. అతను “దగ్గరకు రమ్మని చెప్పి”.

“సరే నీ పరిస్థితి చూస్తే జాలేస్తోంది. ఇప్పుడొకటి చెప్తాను. అలా చేయి” అన్నాడు. చెప్పాడు యోగి, “సరే..” నన్నాడతను. అతను తన భవంతికి వెళ్ళాడు. అతని వెనకే ఉండి నోరు తెరచి భూతం క్షణం ఆలస్యం చేస్తే అతనిని మింగేసేలా ఉంది భూతం. ప్రమాదాన్ని గమనించిన అతను మన ఇంటి ఆవరణలో ఓ పెద్ద ఇనుప స్తంభం కావాలన్నాడతను. వెంటనే భూతం ఓ పెద పెద్ద స్తంభాన్ని ఏర్పాటు చేసేసింది. ఆ స్తంభాన్ని తళతళలాడేటట్లు చేయమన్నాడతను.

భూతం అతను చెప్పినట్టే చేసింది. అప్పుడతను ఆ భూతంతో “ఇదిగో చూడు.. నువ్విప్పుడు ఏం చేయాలంటే నేను ఆపు.. అన్నంత వరకు ఈ స్తంభంపైకి ఎక్కి దిగుతుండాలి, అంటే దిగాలి, ఎక్కాలి. ఎక్కాలి, దిగాలి. ఆపకూడదు” అన్నాడు. అన్నాడు. భూతం “అలాగే..” అని ఎక్కడం దిగడం చేస్తూ వచ్చింది. ఆ తర్వాత తనకేదన్నా కావాలంటే చూత్రం పిలిచి పని చెప్పి తిరిగి ఆ స్తంభాన్ని ఎక్కీ, దిగీ చేస్తుండమన్నాడు.

Self Realization: ఇది ఒక కథ మాత్రమే.

ఇంతకీ ఎందుకీ కథ అంటే- మనిషి మనసు, ఈ భూతమూ ఒక్కలాంటివే. సరైన ఆలోచన లేకున్నా మంచి పని చేయకున్నా ఆ మనసు’ చెడు మార్గంలో పోతుంది. ఇష్టమొచ్చినట్టు చేసి మనిషి ప్రాణాన్ని దెబ్బతీస్తుంది. దురాలోచనలను పుట్టించి చెడు పనులు చేయమని రెచ్చగొడుతుంది. కనుక మనసనే భూతానికి పని లేనప్పుడల్లా ఈశ్వర ధ్యానమనే స్తంభాన్ని ఆచరిస్తూ ఉండాలన్నారు స్వామీ చిన్మయానంద. కానీ మనమందరం ఏదో ఓ స్తంభాన్ని పట్టుకుంటూనే ఉంటాం.

ఓ గృహస్తుడు ఎంతో గొప్పగా “నేను ఎప్పుడూ ఖాళీగా ఉండను. ఎప్పుడూ నా భార్య ఎదుటే నిలబడి నేను ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాను” అని అన్నాడు.

“మాటలు మధ్యలో ఆపనే ఆపరా మాటలు” అని అడిగాను.

“ఆప”నన్నాడు ఆ గృహస్తుడు.

“ఎందుకు?” అని అడిగాను.

అప్పుడతను “నేను మాట్లాడటం ఆపేస్తే తాను మాట్లాడటం మొదలు పెడుతుంది. ఆమె మాటలు వినడం కన్నా నేను ఏదో ఒకటి వాగుతుండటమే నాకు మేలు” అన్నాడు.

Read also: Hindi Vaartha
Read also: Story: Mutual Divorce-చీలిన దారులు

#ConquerTheMind #DailyMeditation #LatestNews #PositiveThinking #SelfRealization #StoryWithMoral Latest News in Telugu Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.